మెగా పవర్ స్టార్ తో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' చిత్రం మార్చి 30న థియేటర్స్ కి రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ సుకుమార్ కి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం తెచ్చిపెడుతుంది. అదెలా అనుకుంటున్నారా...
చిరంజీవి హీరోగా రూపొందిన 'గ్యాంగ్ లీడర్' ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా ఫ్యాన్స్ గుండెల్లో ఈ సినిమాకి ఓ స్థానం ఉంది. అన్నీకుదిరితే ఈ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ స్టర్ అయ్యే అవకాశముంది. డైరెక్టర్ సుకుమార్ ఇటీవల చిరంజీవికి ఓ స్టోరీ లైన్ వినిపించారట. ఇది గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ అట. చిరు ఈ స్టోరీ పట్ల ఫుల్ ఇంప్రెస్ అయిపోయారట. అంతే కాకుండా 'రంగస్థలం' చిత్రాన్ని సుకుమార్ హ్యాండిల్ చేసిన విధానం చిరుని చాలా ఇంప్రెస్ చేసిందట. దాంతో 'రంగస్థలం' రిజల్ట్ ని బట్టి, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆలోచనలో చిరు ఉన్నట్టు సమాచారమ్. ఇదే కనుక జరిగితే సుక్కు బంపర్ ఆఫర్ కొట్టినట్టేనని చెప్పొచ్చు.