మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రం భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి స్టార్ లు ఈ సినిమాలో అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరకముందు ఐటమ్ సాంగ్స్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ తర్వాత ఏ భాషలోనూ ఐటమ్ సాంగ్స్ చేయలేదు. పెళ్లి చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్ తో 'సైరా' లోని ఐటమ్ సాంగ్ చేయించాలని నిర్మాత రాంచరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. ఇందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆల్రెడీ 'సైరా' కాస్టింగ్ టీమ్ ఈ బాలీవుడ్ స్టార్ ని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఆమె నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారమ్. భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతో్న్న సినిమా, పైగా బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర చేస్తున్న సినిమా కాబట్టి, బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే... అప్పుడు అధికారికంగా ప్రకటించడం కోసం చిత్రం యూనిట్ వెయిట్ చేస్తోందట. మరి ఈ స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా... వేచి చూద్దాం.