యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు... అని ఆలోచిస్తున్నారా... రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ కాదండి... రీల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమా 'అరవింద సమేత వీరరాఘవ'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తెలుగమ్మాయి ఇషా రెబ్బ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇషా చేస్తున్న పాత్ర గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా ఇషా నటిస్తోందట. ఇషా, ఎన్టీఆర్ పాల్గొనగా కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఎన్టీఆర్ తో షూటింగ్ లో పాల్గొన్న ఇషా రెబ్బ ఇటీవల ఓ సందర్భంలో ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తూ మాట్లాడింది. సెట్ లో ఎన్టీఆర్ చాలా కూల్ గా ఉంటారని, తన ఈజీ గోయింగ్ నేచర్ వల్ల అందరం కంఫర్టబుల్ గా ఉంటామని తెలియజేసింది ఇషా రెబ్బ. సో.. అమ్మడు ఈ సినిమా అవకాశం పట్ల చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. మరి ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' ఇషా కెరియర్ కి ఎలాంటి మలుపు అవుతుందో వేచిచూద్దాం.