ఓ స్టార్ హీరోగా ఎన్టీఆర్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సినిమాలకున్న క్రేజ్, ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్న బిజినెస్ కు సంబంధించి కూడా చెప్పాల్సిన అవసరంలేదు. టాప్ రేంజ్ లో దూసుకెళుతున్నాడు. ఈ స్టార్ హీరో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హీరోలు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టడం కొత్తేం కాదు. స్టూడియోస్, డిస్ట్రిబ్యూషన్, స్కూల్స్, హోటల్స్, రియల్ ఎస్టేట్.. ఇలా రంగాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్నారు. ఎన్టీఆర్ అయితే మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో మిని మల్టీప్లెక్స్ థియేటర్స్ ని నెలకొల్పడానికి ఎన్టీఆర్ ఆసక్తి కనబరుస్తున్నాడట. కొంతమంది కార్పోరేటర్స్ ఈ మిని మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ తో ఎన్టీఆర్ ని అప్రోచ్ అయ్యారని సమాచారమ్. ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి కనబరుస్తున్నాడట. ఇదే కనుక జరిగితే బిజినెస్ మ్యాన్ గా ఎన్టీఆర్ సక్సెస్ ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూద్దాం.