స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇటీవల ఓ రైటర్ ఓ స్ర్కిఫ్ట్ ని నరేట్ చేసాడట. ఇది పొలిటికల్ థ్రిల్లర్. స్ర్కిఫ్ట్ విన్న తర్వాత అల్లు అర్జున్ రిజెక్ట్ చేసాడట. తనకు ఈ స్ర్కిఫ్ట్ సూట్ అవ్వదని చెప్పాడట. అసలు ఈ స్ర్కిఫ్ట్ హీరో నాని కోసం తయారు చేసిందని తెలుస్తోంది. 'సభకు నమస్కారం' టైటిల్ ని కూడా అనుకున్నారు. నాని హీరోగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసారు. అయితే అల్లు అర్జున్ ఈ మధ్య స్ర్కిఫ్ట్ లు నచ్చడంలేదని, తన తదుపరి సినిమాని హోల్డ్ లో పెట్టేసాడు.
ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ దగ్గరకి ఓ రైటర్ ని పంపించి 'సభకు నమస్కారం' స్ర్కిఫ్ట్ ని చెప్పించాడట దిల్ రాజు. కానీ అల్లు అర్జున్ ఈ స్ర్కిఫ్ట్ నచ్చలేదని చెప్పడంతో చేసేదేంలేక కామ్ అయిపోయాడట. నానితోనే 'సభకు నమస్కారం' సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాడట దిల్ రాజు. మరి అల్లు అర్జున్ కి నచ్చని స్ర్కిఫ్ట్ నాని కి ఏ మేరకు సూట్ అవుతుందో వేచి చూడాల్సిందే.