యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యస్.యస్.రాజమౌళి భారీ మల్టీస్టారర్ #RRR సెకండ్ షెడ్యూల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రాంచరణ్ తప్ప... ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారు, కీలక పాత్రలు ఎవరు చేయబోతున్నారు అనే విషయం అధికారికంగా బయటికిరాలేదు.
కాగా తాజా వార్తల ప్రకారం తమిళ్ డైరెక్టర్ సముద్రఖని రాంచరణ్ బాబాయ్ గా నటించబోతున్నారట. ఈ క్యారెక్టర్ కోసం చాలామందిని పరిశీలించి ఫైనల్ గా సముద్రఖనిని తీసుకున్నారట రాజమౌళి. సముద్రఖని తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయస్థుడే. ధనుష్, కార్తీ తెలుగు డబ్బింగ్ చిత్రాల ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు సముద్రఖని. #RRR తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కుతోంది కాబట్టి, రెండు భాషలకు చెందిన నటీనటులను తీసుకోవడానికి రాజమౌళి ప్రిపరెన్స్ ఇస్తున్నారట. ఇంకా కొంతమంది నటీనటులు కూడా ఫైనలైజ్ అయ్యారని తెలుస్తోంది. అయితే అధికారికంగా వారి పేర్లు బయటికి రావాల్సి ఉంది. మరి #RRR లో బాబాయ్ సముద్రఖని పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, ఈ పాత్ర నిడివి ఎంత ఉంటుందో, బాబాయ్, అబ్బాయ్ ల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో వేచిచూడాల్సిందే.