'కూలి నెం.1'... ఈ చిత్రాన్ని మర్చిపోగలమా... వెంకటేష్, టబు జత కట్టిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. టబుకి టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన సినిమా ఇది. కాగా చాలా గ్యాప్ తర్వాత టబు టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా కోసం టబుని కాంటాక్ట్ చేసారనే వార్తలు ఓ పక్కన ప్రచారమవుతోంటే, తాజాగా రానా సినిమా కోసం టబుని కాంటాక్ట్ చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి.
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉదుగుల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం టబుని కాంటాక్ట్ చేసారని సమాచారమ్. టబు ఎంట్రీ గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందోకానీ, టబు ఈ సినిమాలు కమిట్ అయితే మాత్రం ఆమె అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. మరి టబుని నిజంగానే అప్రోచ్ అయితే, ఆమె ఈ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా వేచిచూద్దాం.