ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'గుణ 369'. డైరెక్టర్ బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రోజు (17.6.2019) ఈ చిత్రం టీజర్ విడుదలయ్యింది. టీజర్ లో కార్తికేయ చెప్పిన డైలాగులు యూత్ ని, మాస్ ని కట్టిపడేసే విధంగా ఉన్నాయి.
''మనం చేసే తప్పుల వల్ల మన జీవితాని కి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు'' అని సాయికుమార్ గంభీరమైన స్వరంతో చెప్పే మాటలతో గుణ 369 టీజర్ ఆరంభమవుతుంది.
''ఆరడగుల హీరో ఓ అమ్మాయి ముందు నిలుచుని స్మైల్ ఇవ్వొచ్చు కదా ఒక్క సెల్ఫీ... నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా బలవంతంగా షట్టర్ క్లోజ్ చేసి ఒకమ్మాయితో మాట్లాడతాననీ.. నాతో మీరు మాట్లాడాల్సిన పనిలేదు. మీతో మీరు మాట్లాడేయండి'' అని ప్రేమను వ్యక్తం చేస్తూ చెప్పే డైలాగులు యూత్‌ను కట్టిపడేసే విధంగా ఉన్నాయి.
''మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్లను చూసి భయపడేది, గొడవలంటే మూసుకుని కూర్చునేది మాకేదన్నా అవుతుందని కాదు. మా అనుకున్న వాళ్లకు ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో...'' అని టీజర్లో కార్తికేయ చెప్పే డైలాగులు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి.
టీజర్ యూత్ ని, మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాలను మించే విధంగా సినిమా ఉంటే కార్తికేయ ఖాతాలో హిట్ ఖాయం. దర్శకుడిగా పరిచయం అవుతున్న అర్జున్ జంధ్యాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.