సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని మాస్ సాంగ్ 'మైండ్ బ్లాక్' సృష్టిస్తున్న సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్య్వూస్ తో దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. కాగా తాజా వార్తల ప్రకారం తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యిందట విజయశాంతి. ఈ డెసిషన్ సినిమాకి కలిసొస్తుందని భావిస్తోందట చిత్రం యూనిట్. త్వరలోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడానికి విజయశాంతి ప్రిపేర్ అవుతోందని సమాచారమ్. సో... విజయశాంతి పవర్ ఫుల్ టచ్ 'సరిలేరు నీకెవ్వరు' కు స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు.