ప్రస్తుతం అల్లు అర్జున్ 'అలా వైకుంఠపురంలో' సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ అల్లు అర్జున్ ఖాతాలో కొత్త రికార్డులు నమోదయ్యేలా చేస్తోంది. ఇదిలా ఉంటే...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్ ఆరంభంకానుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకి 'శేషాచలం' టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ తెలియజేసారు. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ఖరారు చేయలేదట. సో... టైటిల్ విషయంలో వస్తున్న వార్తలు నిజంకాదని ఫిక్స్ అయిపోవచ్చు.