కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో టివి సీరియల్ షూటింగ్స్ ఆరంభమయ్యాయి. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని షూటింగ్ లు చేస్తున్నారు. అయినప్పటికీ ఓ నటుడు కరోనా బారిన పడటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.
జి టివిలో టెలికాస్ట్ అవుతున్న 'సూర్యకాంతం' సీరియల్ షూటింగ్ జరుగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆ సీరియల్ లో నటిస్తున్న ప్రభాకర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడం ఈ యూనిట్ ని షాక్ కి గురి చేసింది. వెంటనే ఆ సీరియల్ నిర్మాత షూటింగ్ ఆపేసి, మొత్తం యూనిట్ మెంబర్స్ ని కరోనా టెస్ట్ లు చేయించుకోవాల్సిందిగా కోరారట. అందరూ క్వారంటైన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ సంఘటనతో టివి సీరియల్స్ షూటింగ్స్ చేస్తున్న మిగతా యూనిట్స్ టెన్షన్ లో పడిపోయారని తెలుస్తోంది. చాలామంది షూటింగ్ లు ఆపేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారమ్.