మెగా నిర్మాత అల్లు అరవింద్ 'ఆహా' పేరుతో ఓ డిజిటల్ యాప్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ని అభివృద్ధి చేయడానికి అల్లు అరవింద్ మెగా ప్లాన్స్ వేస్తున్నారు. ఈ యాప్ కోసం హెబ్బా పటేల్ తో ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఇదే యాప్ కోసం పాయల్ రాజ్ ఫుత్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించబోతోందని సమాచారమ్.
తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నాని తన 'ఆహా' యాప్ కోసం రంగంలోకి దింపబోతున్నారని తెలుస్తోంది. తమన్నాతో ఓ స్పెషల్ టాక్ షో ఈ యాప్ కోసం చేయయడానికి సన్నాహాలు చేస్తున్నారట అల్లు అరవింద్. సో... స్టార్ హీరోయిన్లను, గ్లామరస్ హీరోయిన్లను మెగా నిర్మాత తన 'ఆహా' యాప్ కోసం బాగానే వాడుకోబోతున్నారని చెప్పొచ్చు.