నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న #BB3 సినిమాపై నెలకొన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీజర్ తో భారీ ఎత్తున అంచనాలు పెంచేసారు బోయపాటి. కాస్టింగ్ విషయంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయడంలేదట. హీరోయిన్లు, సపోర్టింగ్ రోల్స్, కీలక పాత్రలపై చాలా కసరత్తు చేస్తున్నారట. పాపులర్ నటీనటులతో ప్రతి పాత్ర చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. తాజా వార్తల ప్రకారం ఓ సీనియర్ హీరోయిన్ ఈ సినిమా కమిట్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరంటే...
రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్ పెద్ద వదినగా నటించింది సీనియర్ హీరోయిన్ స్నేహ. ఇప్పుడు మళ్లీ స్నేహను #BB3 కోసం తీసుకున్నారట బోయపాటి. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య సరసన కనువిందు చేయనుందట స్నేహ. ఆల్ రెడీ 'మహారధి', 'పాండురంగడు' సినిమాల్లో బాలయ్య సరసన నటించింది స్నేహ. ముచ్చటగా మూడోసారి బాలయ్య సరసన అలరించనుంది. ఇంకొన్ని పాత్రలకు నటీనటులను ఫైనలైజ్ చేసే పనిమీద బిజీగా ఉన్నారట బోయపాటి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట.