తెల్లటి గడ్డం, మెలితిప్పిన మీసాలు, డిఫరెంట్ హెయిర్ స్టైల్, డ్రెసింగ్, ముఖంపై పచ్చబొట్టు, చేతిలో పదునైన పెద్ద కత్తి పట్టుకుని ఏదో సుధీర్ఘమైన ఆలోచనలో ఉన్నట్టు లుక్. లుక్ అదిరిపోయింది. ఆ లుక్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన అంశం అధీరా లుక్. ఇంతకూ అధీర ఎవరు? క్రూరమైన వ్యక్తి. తను అనుకున్నది సాధించే క్రమంలో ఎంతటి క్రూరత్వానికైనా తెగించే వ్యక్తి. అధీరాకు ఏం కావాలి? అంటే ... ‘కె.జి.యఫ్ చాప్టర్2’ చూడాల్సిందేనని అంటున్నారు చిత్రం యూనిట్. అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు.
రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. ఈ రోజు సంజయ్ దత్ పుట్టినరోజు (జూలై 29). ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’లోని అధీరా లుక్‌ను విడుదల చేసింది. ఈ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.