ముద్దుగుమ్మ ఇలియానా దాదాపు 7యేళ్ల పాటు తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ హోదాతో ఓ వెలుగు వెలిగింది. ఇప్పడు మళ్లీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇలియానా తహతహలాడుతోందట. ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందట.
కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇలియానాని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. దాంతో ఈ సినిమా ఆఫర్ తనకు వస్తే, పారితోషికం తగ్గించుకుంటాననే సంకేతాన్ని చిత్రం యూనిట్ కి పంపించిందట ఇలియానా.
మరి పారితోషికం తగ్గించుకుంటానని చెప్పింది కాబట్టి ఇలియానాకి ఈ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీకి అవకాశం దక్కుతుందేమో వేచిచూద్దాం.