మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. ఇటీవలే మెగా డాటర్ నిహారిక పెళ్లి కుదిరింది. వెంటనే వరుణ్ తేజ్ ప్రేమకు సంబంధించిన వార్తలు బయటికి రావడంతో మెగాబ్రదర్ నాగబాబు పిల్లలిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ వరుణ్ తేజ్ ఎవరి ప్రేమలో పడ్డాడో తెలుసా...
తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ హీరోయిన్ వరుణ్ తేజ్ కంటే సీనియర్ హీరోయిన్. ఇంతకంటే విషయాలు బయటపెట్టలేము. ఎందుకంటే వరుణ్ తేజ్ వైపు నుంచి కానీ, తన కుటుంబం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే సదురు హీరోయిన్ వైపు నుంచి కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. నిహారిక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ ప్రేమ, పెళ్లికి సంబంధించి అధికారికంగా వెల్లడించే అవకాశముందని సమాచారమ్. చూద్దాం మరి... వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి వరకూ వెళుతుందేమో...?