డైరెక్టర్ మారుతి తదుపరి సినిమాకి రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది. 'ప్రతిరోజు పండగే' లాంటి హిట్ సినిమా ఇచ్చిన మారుతి తర్వాత సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడని, మారుతి చెప్పిన ఓ స్ర్కిఫ్ట్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి క్లారటీ లేదు.
తాజా వార్తల ప్రకారం మారుతి చెప్పిన ఓ స్ర్కిఫ్ట్ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మారుతి, నాని కాంబినేషన్ లో 'భలే భలే మగాడివోయ్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిటయ్యింది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ నేపధ్యంలో మరోసారి మారుతితో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. సో... హిట్ కాంబినేషన్ రిపీట్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.