కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా సరే ఇంకా సినిమా షూటింగ్ లు ఆరంభమవ్వలేదు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో షూటింగ్ లు చేయడానికి హీరోలు ఇష్టపడటంలేదు. దాంతో ఇంతవరకూ షూటింగ్ లు ఆరంభమవ్వలేదు.
మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న 'సిటీమార్' షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే గోపీచంద్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సుముఖంగా లేడని తెలుస్తోంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న కారణంగా తను షూటింగ్ కు అటెండ్ అయ్యి, రిస్క్ చేయలేనని 'సీటీమార్' దర్శక, నిర్మాతలకు తేల్చి చెప్పాడట హీరో గోపీచంద్. కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ ప్రారంభించుకుందామని చెప్పి హ్యాండ్ ఇవ్వడంతో యూనిట్ డైలమాలో పడిపోయిందట. సో... 'సీటీమార్' షూటింగ్ ఇప్పట్లో ఆరంభమయ్యే అవకాశంలేదని చెప్పొచ్చు.