కుర్ర హీరో నితిన్ తో రొమాన్స్ కి పొడుగుకాళ్లసుందరి పూజా హెగ్డె నో చెప్పిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ఎత్తున హల్ చల్ చేస్తున్న వార్త ఇది. అసలు పూజా హెగ్డె రిజెక్ట్ చేసిన సినిమా ఏంటీ... ఎందుకు ఈ సినిమాకి నో చెప్పింది అనే వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'అంధాధున్' నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాకి ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
కాగా ఈ సినిమా కోసం పూజా హెగ్డెని హీరోయిన్ గా తీసుకోవడానికి సంప్రతింపులు జరిపారట. అయితే ఈ హిట్ సినిమా రీమేక్ లో నటించడానికి నో చెప్పిందట. తను ముందుగా కమిట్ అయిన సినిమాల వల్ల, ఈ సినిమాకి డేట్స్ కేటాయించడం కష్టమని భావించిన పూజా హెగ్డె ఈ రీమేక్ ని రిజెక్ట్ చేసిందని సమాచారమ్. అలా పూజా హెగ్డెతో రొమాన్స్ చేసే అవకాశం నితిన్ చేజారింది. మరి ఈ సినిమాకి ఫైనల్ గా ఎవరు హీరోయిన్ గా సెట్ అవుతారో వేచిచూద్దాం.