నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #BB3 సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోని విలన్ గా తీసుకున్నట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ ఉంటుందట. కాగా ఈ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పాత్ర నిడివి తక్కువైనప్పటికీ, పవర్ ఫుల్ రోల్ కాబట్టి... బాలీవుడ్ హీరోని ఈ పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారమ్.
ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా నెగటివ్ షేడ్ రోల్ చేస్తున్నాడు. బాలయ్య సరసన పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో నందమూరి అభిమానులు ఉన్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకోనుందో వేచిచూద్దాం.