డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'ఫైటర్' అనేది వర్కింగ్ టైటిల్. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ లుక్ ని కూడా రివీల్ చేసారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేప్పే విధంగా విజయ్ దేవరకొండ లుక్, టైటిల్ ఉంది.
ఈ సినిమా టైటిల్ 'లైగర్'. 'సాలా క్రాస్‌బ్రీడ్' అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్నఫస్ట్లుక్ పోస్టర్లో విజయ్‌దేవరకొండ పొడవాటి జుట్టు, చేతికి గ్లౌవ్స్‌తో మార్షల్ ఆర్టిస్ట్‌లా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సింహం మరియు పులి యొక్క మిశ్రమ రూపం ఉంది. టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ 'లైగర్'.
తన హీరోలను పూర్తిగా భిన్నమైన అవతారాలలో చూపించే పూరి... విజయ్ దేవరకొండను ఇంతవరకూ చూడని డిఫరెంట్ లుక్‌తో ఈ సినిమాలో చూపించబోతున్నారని టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తెలియజేస్తోంది.
పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది.