మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన 'క్రాక్' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తల ప్రకారం సోనూసూద్ హిందీ రీమేక్ లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడట. 'క్రాక్' సినిమా సోనూకి చాలా నచ్చిందట. ఈ నేపధ్యంలో 'క్రాక్' హిందీ రీమేక్ లో నటించి బాలీవుడ్ లో హీరోగా తన అదృష్టాన్నిపరిక్షించుకోవాలనుకుంటున్నాడట. 'క్రాక్' నిర్మాత ఠాగూర్ మధుతో ఆల్ రెడీ చర్చలు కూడా జరుపుతున్నాడట సోనూ. అన్ని కుదిరితే, 'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్ హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ వార్త ఎంత వరకూ నిజమవుతుందో వేచిచూద్దాం.