విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'ఎఫ్ 3'. ఇది 'ఎఫ్ 2' కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న సినిమా. 'ఎఫ్ 2' కంటే మోర్ ఫన్ ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెబుతున్నారు. ఇదిలా ఉంటే...
'ఎఫ్ 2' లో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. ఇప్పుడు 'ఎఫ్ 3' లో కూడా తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు మరో హీరోయిన్ ని కూడా తీసుకున్నారని తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరంటే...నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'రూలర్' సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సోనాల్ చౌహాన్. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపించనుందట. మరి సోనాల్ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రియేట్ చేసిన పాత్ర ఎలా ఉండబోతుందో... గ్లామర్ పాత్ర అంటే... అమ్మడు ఏ రేంజ్ లో అందాలు ఒలకబోయనుందో వేచిచూడాల్సిందే.
ప్రస్తుతం ఈ చిత్రం 60శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మే, జూన్ కల్లా షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ 27న ఈ సినిమాని విడుదల చేయాలనే ప్లాన్ తో చిత్రం యూనిట్ ఉంది.