View

నా టార్గెట్ అదే - మంచు విష్ణు

Friday,September24th,2021, 05:00 PM

#ManchuVishnu #manifesto in #MaaElections #Announced #MovieArtistElections #Hottopic in #Tollywood

ప్రస్తుతం టాలీవుడ్ లో 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు సృష్టిస్తున్న ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ 'మా' అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించగా... ఈ రోజు (24.9.2021) విష్ణు మంచు తన ప్యానెల్ సభ్యులతో మీడియా ముందుకు వచ్చి, తమ మ్యానిఫెస్టో ఎలా ఉండబోతుందో  తెలియజేసారు. 


విద్యకు ప్రాధాన్యం
'మా' లో మార్పు తీసుకురావడం తన టార్గెట్ అని చెప్పిన విష్ణు మంచు, ప్రతి సభ్యుడికి 'మెడి క్లెయిమ్' ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 'మా' బిల్డింగ్ తో పాటు 'ఎడ్యుకేషన్' కి ప్రయార్టీ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు. ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి చర్చించామని, ఎవరికైనా ఈ పాలసీపై వివరాలు కావాలంటే డిబేట్ కి కూడా రెడీ అని తెలియజేసారు. తన ప్యానెల్ లో మహిళలకు చోటు కల్పించిన విష్ణు, చిత్ర పరిశ్రమకు మహిళలు రావాలని... వారి సేఫ్టీ గురించి కూడా కేర్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం అందరినీ మెప్పిస్తున్న విషయం.


రాజకీయ పార్టీలను లాగొద్దు
చాలా వరకూ ఏకగ్రీవం కోసం ప్రయత్నించినప్పటికీ, కుదరలేదని... ఇలా పోటీ పడటం చాలా బాధగా ఉందని చెప్పారు విష్ణు. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా 'మా' సభ్యుల కోసం వర్క్ చేస్తానని చెప్పడం హర్షించదగ్గ విషయం. ఇక 'మా' ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలను లాగొద్దని, తన ప్యానెల్ లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని కూడా తెలియజేసారు విష్ణు. మొత్తం మీద సీనియర్ నటీనటులను గౌరవించడం, వారికి పెన్షన్లు, హెల్త్ ఇన్యూరెన్స్ లు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పడం అందరినీ ఆకర్షిస్తున్న విషయం.


రౌండ్ ది క్లాక్
ఓవరాల్ గా మంచు విష్ణు 'మా' కోసం ఎంత కష్టపడటానికైనా, రౌండ్ ది క్లాక్ 'మా' సభ్యులకు అందుబాటులో ఉండటానికైనా సిద్ధం అని చెప్పడం తనకు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. చూద్దాం మరి అక్టోబర్ 10న జరగబోతున్న 'మా' ఎన్నికల్లో గెలుపెవరిదో...!


మంచు విష్ణు ప్యానెల్
26 మందితో ప్యానెల్ ని ప్రకటించిన విష్ణు మంచు అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, పృధ్వీరాజ్ బరిలోకి దిగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబుమోహన్, ట్రెజరర్ గా శివబాలాజీ.. జాయింట్ సెక్రటరీగా కరాటే కల్యాణి, గౌతమ్ రాజు పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 18 మంది పోటీ చేయబోతున్నారు. అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాధ్ బాబు, మలక్ పేట శైలజ, మాణిక్, నటి పూజిత, రాజేశ్వరిరెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, సీనియర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మీ, ఘర్షణ శ్రీనివాస్, జయవాణి, స్వప్నమాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !