View

శ్రీవారి పాదాల చెంత 'సంపూర్ణ భగవద్గీత' ఆడియో తొలి ప్రతి

Friday,February13th,2015, 12:23 PM

మానవాళికి జ్గానాన్ని ప్రసాదించే అత్యుత్తమ ఉత్తమ గ్రంధం 'భగవద్గీత' అని తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్య నిర్వహణాధికారి 'పోలా భాస్కర్' పేర్కొన్నారు. 'భగవద్గీత ఫౌండేషన్ ' ఆధ్వర్యంలో రూపొందిచిన 'సంపూర్ణ భగవద్గీత ఆడియో' తొలి ప్రతిని తిరుమల శ్రీవారి చెంతకు తీసుకు వెళ్లేందుకు అలిపిరి పాదాల మండపం వద్ద బుధవారం (11-2-15) చేపట్టిన పాదయాత్రను జే ఈ వో ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలా భాస్కర్ మాట్లాడుతూ..'సనాతన హైందవ ధర్మ ప్రచారానికి 'భగవద్గీత' ఎంతగానో తోడ్పడుతుందన్నారు. భారతదేశం లో 'గీత' కు ఎంతో ప్రాశస్త్యం ఉందని, ఇది మానవాళి ఉత్తమ జీవన విధానాన్ని నిర్దేశిస్తుందని వివరించారు. 'భగవద్గీత'లోని మొత్తం 700 శ్లోకాలను తాత్పర్య సహితంగా రికార్డ్ చేసి భక్తులకు అందించేందుకు 'భగవద్గీత ఫౌండేషన్' వ్యవస్థాపక అధ్యక్షుడు యల్.వి. గంగాధర శాస్త్రి ఏడేళ్ళ కృషిని కొనియాడారు.

ఈ సందర్భంగా అలిపిరి పాదాల వద్ద భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, గాయకుడు సంగీత దర్శకుడు గంగాధరశాస్త్రి మాట్లాడుతూ ... భారతీయ సంగీత చర్రిత్రలోనే మొట్టమొదటి సారిగా అత్యున్నత సాకేంతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా సంపూర్ణ భగవద్గీత గానాన్ని తెలుగు తాత్పర్య సహితంగా రికార్డ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆడియో సిడి ల తొలి ప్రతిని సుప్రసిద్ధ గాయకుడు 'ఘంటసాల' వర్ధంతి సందర్భంగా బుధవారం (11-2-15) తిరుమలకు పాదయాత్రగా తీసుకువెళ్లినట్లు తెలిపారు. సంపూర్ణ భగవద్గీత ఆడియో సిడి తొలి ప్రతిని శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో తమ ఫౌండేషన్ సభ్యులతో కలసి తిరుమలకు వచ్చినట్లు ఆయన తెలిపారు.100 మందికి పైగా సాంకేతిక నిపుణులు, పండితుల సహకారంతో ఈ సంపూర్ణ భగవద్గీతను రూపొందించామన్నారు. దీనికి అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తి అన్నారు. భక్తిగీతాలు, గోవింద నామ స్మరణ, భగవద్గీత శ్లోకాల సందేశాన్ని మననం చేసుకుంటూ వెళ్లి ఆడియో సిడి ల తొలి ప్రతిని శ్రీవారి పాదాల చెంత ఉంచటంతో ఈ పాదయాత్ర ముగిసిందని అన్నారు.. ఈ ఆడియో సిడి ల ప్యాక్ లో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, సంపూర్ణ భగవద్గీత పారాయణం, రికార్డింగ్ ప్రక్రియకు సంభందించిన లఘు చిత్రం కలిపి మొత్తం 20 సిడి లు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసాంతంలో సంపూర్ణ భగవద్గీత' ఆడియో విడుదల అవుతుందని గంగాధర శాస్త్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యెక అధికారి శ్రీరాం రఘునాద్, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపల్ వైవీఎస్ పద్మావతి, అధ్యాపకులు, వందలాదిమంది విద్యార్ధులు,జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు ,భగవద్గీత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !