View

విక్రమ్ ని వాయించేసిన త్రిష, ఆమె తల్లి!

Thursday,March06th,2014, 04:13 AM

విక్రమ్ హీరోగా ధరణి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి 'రాస్కెల్' అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. కాగా, ఇందులో తనని కథానాయికగా తీసుకుంటారని త్రిష ఊహించిందట. 'సామి', 'భీమ' చిత్రాల్లో విక్రమ్ సరసన నటించింది త్రిష. అలాగే, ఈ ఇద్దరూ కలిసి యాడ్స్ లో కూడా చేశారు. దానివల్ల విక్రమ్ తనకే ప్రిఫరెన్స్ ఇస్తాడని నమ్మింది త్రిష. అయితే, ఆ నమ్మకం వమ్మయ్యింది. ఈ చిత్రంలో హన్సికను కథానాయికగా ఎంపిక చేశారట. వాస్తవానికి గతంలో విక్రమ్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం వస్తే, డేట్స్ ఖాళీ లేవని హన్సిక ఒప్పుకోలేదు. అందుకని, 'రాస్కెల్' సినిమా గురించి తెలుసుకుని, తనే స్వయంగా విక్రమ్ తో మాట్లాడి ఈ సినిమాలో కథానాయికగా చేస్తానని హన్సిక చెప్పిందనే వార్త ప్రచారంలో ఉంది. విక్రమ్ కూడా హన్సికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిత్రదర్శకుడు ధరణి ఆమెనే ఖరారు చేశాడని కోలీవుడ్ టాక్. ఈ సినిమా చేజారినందుకు తెగ బాధపడిపోయిన త్రిష స్వయంగా విక్రమ్ కి ఫోన్ చేసి, చెడామడా వాయించేసిందని సమాచారం. అది మాత్రమే కాదు.. త్రిష తల్లి ఉమాకృష్ణన్ కూడా విక్రమ్ కి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీన్నిబట్టి 'రాస్కెల్' చేజారినందుకు ఈ తల్లీకూతుళ్లు ఎంత ఫీలయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే 'దిల్', 'ధూల్' వంటి హిట్ చిత్రాల తర్వాత విక్రమ్, ధరణి దర్శకత్వంలో రూపొందనున్న ఈ 'రాస్కెల్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇటు విక్రమ్ అటు ధరణికి సరైన విజయాలు లేవు. దాంతో ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడతారనే అంచనాలు ఉన్నాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !