విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు పెత్త ఎత్తున అభిమానులు అయిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పెళ్లికి సంబంధించి వార్తలు ప్రచారమవుతున్నాయి.
విజయ్ దేవరకొండ టాలీవుడ్ కి చెందిన బిగ్ ఫ్యామిలీలోని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనేది ఆ వార్త. ఇరువైపు పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించినట్టు తెలుస్తోంది. కాకపోతే విజయ్ దేవరకొండ, ఆ అమ్మాయి ఇద్దరూ మాట్లాడుకుని కెరియర్ డిస్ట్రర్బ్ అవ్వకుండా ఉండాలంటే కొన్నాళ్లు పెళ్లి చేసుకోకూడదనుకుంటున్నారట. విజయ్ దేవరకొండకు కెరియర్ పరంగా కూడా ఈ అమ్మాయి సలహాలు ఇస్తోందట. అయితే తన కెరీర్ కూడా గాడిలో పడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే టార్గెట్ ఆ అమ్మాయికి ఉందట. అందుకే పెళ్లి ఎప్పుడనే విషయాన్ని డిసైడ్ చేయలేదటగానీ, విజయ్ దేవరకొండతో ఆ అమ్మాయి పెళ్లి మాత్రం ఫిక్స్ అయిపోయినట్టు సమాచారమ్. సో.... టాలీవుడ్ కి చెందిన ఓ బిగ్ ఫ్యామిలీకి విజయ్ దేవరకొండ అల్లుడు కాబోతున్నాడని చెప్పొచ్చు.