యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటీ... ఎవరి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడనే చర్చ జరుగుతోంది.
ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు 'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారమ్. ఈ విషయంలో కొరటాలకు కూడా క్లారటీ ఇచ్చేసాడట ఎన్టీఆర్. 'ఆర్ఆర్ఆర్' పూర్తయ్యేలోపు మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ చేయబోతున్న సినిమా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోందట. సో... జనతాగ్యారేజ్ తర్వాత రెండోసారి ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ సినిమాకి రంగం సిద్ధమవుతోందని ఊహించవచ్చు.