పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమాయత్తమవుతున్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే...
డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను ఎంపిక చేసారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే "వర్షం", "పౌర్ణమి" తర్వాత ప్రభాస్, త్రిష జత కట్టబోతున్న మూడో చిత్రం ఇదే అవుతుంది. ప్రభాస్, త్రిష ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ అదిరిపోతుందని, ఈ జంట కలిసి ఓ సినిమా చేయాలని చాల కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే... ప్రభాస్, త్రిష జంటను స్ర్కీన్ పై చూడాలని కోరుకునే వారి కోరిక నెరవేరినట్టేనని చెప్పొచ్చు.