స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా అయితే, రెండోది వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోతున్న 'ఐకాన్'. కాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. వేణు శ్రీరామ్, అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి హీరోయిన్ ని ఫైనలైజ్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయట.
తాజా వార్తల ప్రకారం అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందిగా సూచించాడట అల్లు అర్జున్. ఈ నేపధ్యంలో అలియా భట్ ని సంప్రదించడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్. టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం #ఆర్ఆర్ఆర్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది అలియా భట్. మరి అల్లు అర్జున్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ఈ యేడాది రెండు తెలుగు సినిమాలు కమిట్ అయినట్టు ఉంటుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. మరి అల్లు అర్జున్ తో రొమాన్స్ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా...!