రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా బయటికి రావడం లేదు. ఇటీవలే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నట్టు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రహమాన్ అఫీషియల్ గా చెప్పారు. తాజాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ కు సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది. ఆ హీరోయిన్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే...
మన హైబ్రీడ్ పిల్ల భానుమతి... అదేనండి సాయిపల్లవి. ప్రస్తుతం సాయిపల్లవి సినిమాలు చేయడం లేదు. అయితే ఈ సినిమాలోని పాత్రకు సాయిపల్లవి అయితే కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నాడట బుచ్చిబాబు సానా. ఆమెతో ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.