View

ఇంటర్వ్యూ - డైరెక్టర్ సతీష్ కుమార్ (ముద్దుగా)

Friday,March28th,2014, 02:13 PM

ప్రముఖ ప్రతికలు ఈనాడు, సాక్షి, ఎలక్ట్రానిక్ చానెల్స్, వెబ్ మీడియాలో జర్నలిస్ట్ à°—à°¾ వర్క్ చేసిన సతీష్ కుమార్ ప్రస్తుతం టాలీవుడ్ చానల్ లో ప్రోగ్రాం హెడ్ à°—à°¾ వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వి.యన్.ఆదిత్య సోదరుడు సతీష్ కుమార్. ఎప్పట్నుంచో దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలనే టార్గెట్ తో ఉన్న సతీష్ కుమార్ 'ముద్దుగా' సినిమాతో  మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. సివి రెడ్డి సమర్పణలో 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై రూపొందిన à°ˆ సినిమాలో విక్రాంత్, పల్లవి ఘోష్ హీరో హీరోయిన్స్ à°—à°¾ నటించారు. రేపు (29.3) ప్రేక్షకులు ముందుకు వస్తోన్న à°ˆ సినిమా విశేషాలను డైరెక్టర్ సతీష్ కుమార్ మీడియాతో పంచుకున్నారు. à°† విశేషాలు మీ కోసం...

మీ తొలి సినిమా 'ముద్దుగా' గురించి చెప్పండి?
'ముద్దుగా'లాంటి కథాబలం ఉన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథ విషయానికొస్తే... ఓ అమ్మాయి తన కుటుంబ సభ్యులతో చెప్పిన అబద్ధం నిజమై, ఆమెకు పెద్ద సమస్యగా మారుతుంది. ఆ సమస్య నుంచి హీరో ఆ అమ్మాయిని ఎలా కాపాడన్నదే ఈ చిత్ర కథ. లవ్, రొమాన్స్ తో పాటు చక్కని కుటుంబ విలువలు కలిగిన సినిమా ఇది.

'ముద్దుగా'  టైటిల్ పెట్టి కుటుంబ విలువలు ఉన్నాయంటున్నారు? à°ˆ టైటిల్ యూత్ ని టార్గెట్ చేసే విధంగా ఉంది?
ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. యూత్ ని మాత్రమే కాదు... అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

మీ సోదరుడు ఆదిత్య 'మనసంతా నువ్వే'లాంటి హిట్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు? మరి మీకు ఆయన నుంచి ఎలాంటి సహకారం అందింది?
ఈ సినిమా కథ విషయంలో మా అన్నయ్య సహకారం ఉంది. ఈ చిత్రం ఎడిటింగ్ జరిగేటప్పుడు కూడా ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. కానీ డైరెక్షన్ విషయంలో మాత్రం ఇన్ వాల్వ్ అవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయన ప్రాజెక్ట్ 'పార్క్' సినిమా తో బిజీగా ఉన్నారు.

లవ్, రొమాన్స్ తో కూడుకున్న సినిమా కాబట్టి, సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది? మరి ఈ సినిమా ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
ఈ సినిమాకి కీరవాణిగారి దగ్గర వర్క్ చేసిన మధు పొన్నాప్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. కథకు యాఫ్ట్ గా ఉండే ట్యూన్స్ ని అందించారు. పాటలన్నీ బాగున్నాయి. ఆడియో పరంగా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విజువల్ గా కూడా పాటలన్నీ బాగుంటాయి.

'లెజెండ్'లాంటి పెద్ద సినిమా విడుదలయ్యింది. ఒక్క రోజు గ్యాప్ లో 'ముద్దుగా' ని విడుదల చేస్తున్నారు? రిస్క్ అనిపించడం లేదా?
రిస్క్ అని ఫీలవ్వడం లేదు. ఓ రకంగా 'లెజెండ్' సినిమాతో పాటు 'ముద్దుగా'ని విడుదల చేయడం ప్లస్ అని బావిస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమా చూడటానికి ధియేటర్ కు వచ్చే ప్రేక్షకులు కరువయ్యారు. ఓ పెద్ద సినిమా విడుదలైతే ఆ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ధియేటర్ కు వస్తున్నారు. ఆ రకంగా ఆ పక్కనే ఆడుతున్న మా చిత్రాన్ని కూడా ప్రేక్షకుల దృష్టిలో పడుతుంది. కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తారు. సినిమా బాగుంటే సినిమా చూసిన ప్రేక్షకులు పదిమందితో చెబుతారు. ఆ రకంగా మౌత్ టాక్ స్ర్పెడ్ అవుతుంది. ఆ రకంగా మా సినిమాకి 'లెజెండ్' ప్లస్సే అవుతుంది.

విక్రాంత్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలనుకున్నారు? మరి ఆయనను హీరోగా తీసుకోవడానికి కారణం?
'ముద్దుగా' కథను ఫైనలైజ్ చేసుకున్న తర్వాత హీరో కోసం ట్రై చేసాం. కానీ విక్రాంత్ ఈ సినిమాకి హీరోగా తీసుకుంటే బాగుంటుందని భావించాను. ఆ మాట విక్రమ్ కి చెప్పాను. పాత్రకు నేను సూట్ అవుతానా అని అడిగాడు. తనకు నచ్చచెప్పాను. ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుంది అనిపిస్తే, ట్రై చేద్దాం అన్నాడు విక్రాంత్. తనకు యాక్టింగ్ రాకపోయినప్పటికీ, చెప్పింది చెప్పినట్టు చేయగల సత్తా విక్రాంత్ కి ఉంది. నేను ఏది చెబితే అది చేసాడు. పాత్రకి వంద శాతం న్యాయం చేసాడు.

ప్రేక్షకులకు ఈ సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో మేము సినిమా చేయలేదు. పాషన్ తో సినిమా చేసాం. మంచి కథ ఈ సినిమాకి కుదిరింది. కుటుంబ విలువలతో కూడుకున్న సినిమా తీయడం పట్ల మా టీమంతా హ్యాపీగా ఉన్నాం. నా శాయశక్తులా కృషి చేసి ఈ సినిమాని తెరకెక్కించాను. ఇక ప్రేక్షకులు ఈ సినిమా చూసి మమ్ముల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తే, మరిన్ని మంచి సినిమాలు రూపుదిద్దుకుంటాయి.

హీరో, నిర్మాత వెంకట్ à°ˆ సినిమా గురించి మాట్లాడుతూ - ''నేను à°ˆ సినిమా కంటే ముందు à°“ షార్ట్ ఫిలిం చేసాను. à°ˆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలనుకున్నాను. కానీ à°ˆ సినిమా కోసం హీరోని వెతికేటప్పుడు నేను చేసిన షార్ట్ ఫిలింని డైరెక్టర్ గారు చూసారు. వెంటనే మన సినిమాకి హీరోగా మీరే ఎందుకు చేయకూడదు అని అడిగారు. నన్ను కన్వీస్ చేసి à°ˆ సినిమా నాతోనే చేసారు ఆయన.  సినిమాకి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు నటించడం చాలా కష్టమని à°ˆ సినిమా చేసేటప్పుడు తెలుసుకున్నాను. సినిమా అవుట్ ఫుట్ చూసిన తర్వాత మాకు à°ˆ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ కలిగింది. అందుకే సొంతంగా à°ˆ సినిమాని విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.

రేపు (29.3) విడుదలవుతోన్న ఈ 'ముద్దుగా' చిత్రం మంచి విజయం సాదించాలని కోరుకుంటూ ఫిల్మీబజ్ డాట్ కామ్ తరఫున ఈ యూనిట్ కి ఆల్ ది బెస్ట్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !