View

ఇంటర్వ్యూ - మంచు లక్ష్మీ ప్రసన్న

Wednesday,April23rd,2014, 01:05 PM

ఒకప్పుడు లక్ష్మీ ప్రసన్న పేరు చెబితే... కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ అనేవారు. ఇప్పుడు తనకంటూ పాపులార్టీని సంపాదించుకుని మల్టీ టాలెంటెడ్ పర్సనాల్టీ అనే స్థాయికి చేరింది లక్ష్మీప్రసన్న. సినిమా మీద ఇష్టంతో నిర్మాతగా మారి సినిమాలు నిర్మించింది. నటించింది. బుల్లితెర కోసం లక్ష్మీప్రసన్న చేసిన షోలు విశేషాదరణ పొందాయి. ప్రస్తుతం తను నటించిన 'చందమామ కథలు' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలతో పాటు, చాలా విషయాలు మీడియాతో ముచ్చటించింది లక్ష్మీప్రసన్న. ఆ విశేషాలు మీ కోసం...

చందమామ కథలు గురించి చెప్పండి?

చందమామ కథలు సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. దానికి కారణం ప్రమోషన్. మీడియా ఈ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేసింది. అందుకు మీడియా వారికి కృతజ్ఞతలు. ఈ సినిమా విడుదల కోసం అందరిలా నేను కూడా ఎదురు చూస్తున్నాను. 8 కథలతో ఈ చిత్రం రూపొందింది. ఒక సందర్భంలో అన్ని కథలకు కనెక్షన్ ఉంటుంది. నా పాత్ర చాలా బాగుంటుంది. అందరికీ నా పాత్ర నచ్చుతుందనే నమ్మకం ఉంది

ఈ సినిమాని అంగీకరించడానికి కారణం?

ఈ స్క్రిఫ్ట్ విన్నప్పుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉండాలని కొన్ని ఆఫర్స్ వచ్చినా అంగీకరించలేదు. ఈ సినిమాలోని పాత్ర రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. అందుకే అంగీకరించి చేసాను.

అంటే సెలెక్టివ్ గా సినిమాలు అంగీకరిస్తున్నారా?

అవును. నాకు వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించేసి డబ్బులు సంపాదించేయాలనే తపన నాకు లేదు. మంచి పాత్ర అయితేనే చేయాలనుకుంటున్నాను. చాలెంజింగ్ రోల్స్ చేసే అవకాశం కోసం ప్రతి నటి ఎదురు చూస్తుంది. కానీ అందరికీ అలాంటి అవకాశాలు రావు. నా వరకూ చందమామ కథలు లో చాలెంజింగ్ రోల్ చేసే అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఈ సినిమా చేసాను.

మీ పాత్ర పేరు, పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటుంది?

ఈ సినిమాలో నేను చేసిన పాత్ర పేరు లిసా స్మిత్. సూపర్ మోడల్. మోడల్ గా ఎన్నో అపజయాలు ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ అపజయాలతో కృంగి పోకుండా, పోరాటం జరిపి విజయం సాధిస్తుంది. లిసా స్మిత్ ఎంతో ఆత్మస్థయిరం కల అమ్మాయి. నాకు చాలా నచ్చిన పాత్ర.

ఈ పాత్ర కోసం సిగరెట్ తాగడం, మందు కొట్టడంలాంటివి చేసారు కదా... ఎలా ఫీలయ్యారు?

నిజం చెప్పాలంటే నేను నిర్మించే సినిమాల్లో కూడా స్మోకింగ్, డ్రింకింగ్ సీన్లు చూపించడానికి ఇష్టపడను. చాలా క్లీన్ గా సినిమా ఉండాలనుకుంటాను. కానీ ఈ సినిమాలో నేను ఓ మోడల్ గా నటించాను. పాత్ర డిమాండ్ మేరకు ఇలాంటి సీన్లు చేయాల్సి వచ్చింది. ఈ సీన్స్ చేసేముందు మందు, సిగరెట్ కాల్చే లేడీస్ ప్రవర్తన ఎలా ఉంటుందనేది గమనించాను. వారి హావాభావాలను క్షుణ్ణంగా పరిశీలించాను. ఆ తర్వాతే ఈ పాత్రలో పూర్తిగా లీనమై నటించగలిగాను.

మీ నాన్నగారు ఈ సినిమా చూసారా?

ఇంకా చూడలేదు. త్వరలో చూడబోతున్నారు. నేను చేసిన లిసా స్మిత్ పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎదురుచూస్తున్నాను. మంచి పాత్రలు చేయమని నాన్నగారు ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. సో... ఆయన నుంచి నాకు అభినందనలే దక్కుతాయని ఆశిస్తున్నాను.

ఇది కాకుండా మీరు చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?

ఇటీవలే ఓ షార్ట్ ఫిల్మ్ చేసాను. అది షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఫైనలైజ్ అవ్వగానే పూర్తి వివరాలు తెలియజేస్తాను.

ఇక ఫైనల్ గా రాజకీయాల గురించి మీ అభిప్రాయం?

రాజకీయాలు అంటే నాకు సదభిప్రాయమే ఉంది. కొన్ని పార్టీలు నన్ను ఆహ్వానించాయి కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సరైన సమయం కాదనేది నా అభిప్రాయం. నాలుగైదు సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వస్తాను. రాజకీయాల్లోకి అడుగుపెడితే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకు నన్నునేను సిద్ధం చేసుకుని పాలిటిక్స్ లోకి అడుగుపెడతాను.

తనకు ఎంతో నచ్చిన పాత్రను 'చందమామ కథలు' సినిమాలో చేసానని చెబుతున్న లక్ష్మీప్రసన్నకు, ఈ పాత్ర మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుందాం.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !