View

ఇంటర్వ్యూ - దర్శకరత్న డా. దాసరి

Monday,April28th,2014, 04:16 AM

"ఇప్పుడు టైమ్ పాస్ నిర్మాతలు ఎక్కువయ్యారు. నిర్మాత ప్రస్తావన లేకుండా 'రేసు గుర్రం' ఆడియో వేడుక జరిగింది. నిర్మాతలకు తగిన విలువ లేదు. దర్శకుల పరిస్థితి కూడా అంతే. క్రియేటర్ కి విలువ లేకపోవడం ఏంటి? ఈ పరిస్థితి బాధాకరం'' అని దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అన్నారు. హీరో, హీరోయిన్లకు, ఇతర నటీనటులకు మాత్రమే పరిమితమైన సినిమా పోస్టర్ లో దర్శకుడి బొమ్మ కూడా పడేలా చేసిన ఘనత దాసరిదే. డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే మాటలకు అచ్చంగా సరిపోతారు దాసరి. మే 4న ఈ దర్శక దిగ్గజం పుట్టినరోజు. ఈ సందర్భంగా డా. దాసరితో జరిపిన ఇంటర్వ్యూ...

సినిమా పరిశ్రమలో మీది సుదీర్ఘ అనుభవం. ఎన్నో మార్పులను చూసి ఉంటారు.. వాటి గురించి చెబుతారా?

సినిమా పరిశ్రమలోకి వచ్చి 52వ సంవత్సరంలోకి, దర్శకునిగా 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. కాకపోతే ఈ సంవత్సరం ఆరంభమే చాలా బాధాకరమైనదిగా భావిస్తున్నా. ఎందుకంటే, నాక్కావల్సినవాళ్లు చాలామంది దూరమయ్యారు. ముఖ్యంగా ఎంతో ఆరోగ్యకరమైన పరిశ్రమను చూసిన నేను అనారోగ్యానికి గురైపోతున్న పరిశ్రమను చూడాల్సి వస్తోందనే బాధ ఉంది. పరిశ్రమ పరంగా వచ్చిన మార్పు గురించి చెప్పాలంటే... డిజిటల్ పరంగా మంచి అభివృద్ధి సాధించాం. అలాగే, హాలీవుడ్ కి పోటీ పడేట్లు కాకపోయినా, ఆ స్థాయికి అటూ ఇటూగా కొన్ని చిత్రాలను రూపొందించడానికి కృషి చేస్తున్నాం. నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను, నిర్మాతలను తీసుకు రాగలుగుతున్నాం. వీటిలో ఎంత ప్లస్ ఉందో అంతే మైనస్ కూడా ఉంది. టెక్నాలజీ అనేది కొన్ని సినిమాలకే అవసరం. ఉదాహరణకు రాజమౌళి తీసిన 'మగధీర'కు టెక్నాలజీ అవసరం. అంతకన్నా 'ఈగ'కి ఇంకా టెక్నిక్ కి అవసరం. కానీ, టెక్నాలజీ అవసరం లేని సినిమాలకు కూడా గ్రాఫిక్స్ కి వెళ్లడం, త్రీడీ చేయాలనుకోవడం సరి కాదు. దానివల్ల సినిమా కిల్ అవుతోంది. రెండోది ప్రతిభ ఉన్న కొత్త నటీనటులను తీసుకు రాలేకపోతున్నాం. వంశ పారంపర్యంగా ఉన్నవాళ్లు ప్రతిభావంతులైనా... కాకపోయినా, వాళ్లకి బ్యాక్ గ్రౌండ్ ఉందని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాం. జనం మీద బలంగా రుద్దుతున్నాం. ఇక, సంగీతం విషయానికొస్తే.. పూర్తిగా మారిపోయింది. సినిమా విడుదలైన తర్వాత ఓ నెల రోజులకి ఆ సినిమాలోని పాటలు పాడుకుందామంటే వినసొంపైనవి ఉండటంలేదు. టేకింగ్ పరంగా, కాస్ట్యూమ్ వైజ్ గా సినిమాలో పాటలు బాగుంటున్నాయి కానీ, విడిగా అంత బాగుండటంలేదు. స్టేజి మీద మంచి పాట పాడుకుందామంటే, మంచి పాటలను వెతుక్కోవాల్సి వచ్చింది. మన తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా ఒక్క పాట ఉండటంలేదు.

చిన్న సినిమాల గురించి?

చిన్న సినిమా విషయానికొస్తే.. సంపూర్ణంగా చనిపోయింది. వారానికి ఆరేడు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. మనమూ ఒక సినిమా విడుదల చేశాం అనేవారికి తప్ప వాటి వల్ల మిగతావాళ్లకి సంతృప్తి లభించడంలేదు. పెద్ద సినిమాల మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు, థియేటర్ లో ఆడించటానికి ఓ చిన్న సినిమా విడుదల చేశాం అనే తృప్తి ఎగ్జిబిటర్లకు మిగులుతోంది. ప్రేమకథా చిత్రమ్, ఉయ్యాల జంపాల, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి కొన్ని చిత్రాలు మినహా ప్రింట్, పబ్లిసిటీ కాస్ట్ వచ్చిన సినిమాలు లేవు. పెద్ద సినిమాల్లోకొస్తే... ఎంత పెద్ద హిట్టయినా ఆ చిత్రనిర్మాతకు నష్టం వస్తోంది. ఎందుకంటే, కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. గతంలో సినిమా పరిశ్రమలో క్రైసెస్ వచ్చినప్పుడు చాంబర్, కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్స్.. ఇలా అందరూ కూర్చుని.. పనిదినాలు ఎలా తగ్గించాలి? నిర్మాణ వ్యయం ఎలా తగ్గించాలి? అని చర్చించుకునేవాళ్లు. ఒక సినిమాని మరో సినిమాకి విడుదలలో గ్యాప్ చూసుకునేవారు. కానీ, ఇప్పుడలా కాదు. అసలిప్పుడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయో లేదో తెలియడంలేదు. ఏ ఆర్గనైజేషన్ కూడా సక్రమంగా పని చేస్తున్నట్లు నాకనిపించడంలేదు. ఏదైనా సమస్య వస్తే నా దగ్గరికొస్తారు. ఈ మధ్య ఎవరూ రావడంలేదు. ఎందుకంటే, సమస్యలేవీ లేవనుకుంటున్నా. అంతా బాగానే ఉందనుకుంటున్నా.

ఒక సినిమా ఎంత పెద్ద హిట్ టాక్ ని సొంతం చేసుకున్నా విడుదలైన నాలుగు రోజుల తర్వాత వసూళ్లు సరిగ్గా ఉండకపోవడానికి కారణం?

ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడంవల్ల మూడు రోజులకే వసూళ్లు వచ్చేస్తున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. నాలుగైదు వారాలు అనే ప్రసక్తే లేదని, ఏ సినిమాకైనా అంతేనన్నది వారి విశ్లేషణ. à°† మాటతో నేను కొంతవరకు ఏకీభవిస్తా. పూర్తిగా ఏకీభవించలేను. ఎందుకు ఏకీభవించనంటే, నా 'ఒసేయ్ రాములమ్మా' సినిమాని 81 ప్రింట్లతో 120 థియేటర్లలో విడుదల చేశాను. రెండో వారంలో 202 ప్రింట్లతో 416 థియేటర్లలో విడుదల చేశాం. 200 థియేటర్లలో 100 రోజులు ఆడింది.  100 థియేటర్లలో 200 రోజులు ఆడింది. à°† రోజుల్లో అంతకన్నా ఎక్కువ థియేటర్లలో విడుదలైన సినిమా లేదు. సినిమాలో సత్తా ఉంటే ఎన్ని రోజులైనా ఆడుతుంది. ఇవాళ à°Žà°‚à°¤ పెద్ద సినిమా అయినా మూడు, నాలుగు రోజులకే తీసేస్తున్నారంటే దానికి కారణం రిపీట్ ఆడియన్స్ లేకపోవడమే. సినిమాలో సత్తా ఉంటే రిపీట్ ఆడియన్స్ ఉంటారు. అలాంటి సినిమా ఎవరు తీస్తున్నారు? గొప్ప సినిమా తీస్తే ఇవాళ రెవెన్యూ ఎంతైనా వస్తుంది. వంద రోజులు ఆడే దమ్మున్న సినిమా తీయాలి.

హిందీ సినిమాల్లా మన సినిమాలకు వంద కోట్లు వసూలు చేసే సత్తా ఉందంటారా?

ఖచ్చితంగా ఉంది. చేరుకోవడం కష్టమేం కాదు. à°•à°¥ మీద శ్రద్ధ వహించాలి. మన తెలుగు పరిశ్రమలో మోస్ట్ కాస్ట్ లీ హీరోలు, దర్శకులు ఉన్నారు. భారీగా సెట్స్ వేస్తున్నారు. అంతే భారీగా కథను తయారు చేసుకుంటే బాగుంటుంది. హీరోలకు అనుగుణంగా సినిమాల తీసేస్తున్నారు. నాకు తెలిసి నేటి తరంలో ఒక్క రాజమౌళి మినహా వేరే ఏ దర్శకుడూ  à°µà°¿à°­à°¿à°¨à±à°¨ తరహా చిత్రం చేయడానికి ప్రయత్నించడంలేదు.

పెద్ద దర్శకులు చిన్న చిత్రాలు కూడా తీయొచ్చుగా?

తియ్యాలి. ఈ ప్రశ్న వాళ్లని అడగాలి. మేం కొత్తవాళ్లతోనూ సినిమా తీశాం. లక్ష రూపాయల బడ్జెట్ తో 'నీడ'లాంటి సినిమా తీసిన నేను ఐదు కోట్ల బడ్జెట్ తో 'తాండ్ర పాపారాయుడు', 'విశ్వనాథ నాయకుడు' లాంటి సినిమాలు తీశాను. అప్పుడు ఐదు కోట్లంటే ఇప్పుడు ఐదువందల కోట్లతో సమానం అన్నమాట. అందుకే నేను దర్శకులందరితో చిన్న సినిమాలు తీయమని చెబుతుంటాను. రాజమౌళితో చెప్పిన తర్వాతే తను 'మర్యాద రామన్న' తీశాడు. అలాగే, శేఖర్ కమ్మల, శ్రీనివాస్ రెడ్డి, మారుతిలాంటివాళ్లతో కూడా పెద్ద హీరోల జోలికి వెళ్లొద్దని చెప్పాను.

పరభాషల తారలు ఎక్కువ కావడం గురించి?

పరిస్థితికి, కథకు తగ్గట్టు నటీనటులను తీసుకోవాలి. 'చిల్లర కొట్టు చిట్టెమ్మ' తీయాలనుకున్నప్పుడు ఈళ్ల సీతయ్య పాత్రను రావు గోపాలరావు, మాడా చేసిన కోటయ్య పాత్రను అల్లు రామలింగయ్యగారు చేస్తానన్నారు. నిర్మాత ఇచ్చిన పదిహేడు రోజుల్లో సినిమాని పూర్తి చేయాలి. వెదురులంకలో ఎండల్లో డే అండ్ నైట్ రామలింగయ్యగారు, రావు గోపాలరావుగారితో చేయడం చిన్న విషయం కాదు. అందుకని గోకిన రామారావు, మాడాతో à°† పాత్రలు చేయించాను. బెనర్జీ అనే బుర్రకథ కళాకారుడితో à°“ పాత్ర చేయించాను. నల్లగొండలో à°“ ఫంక్షన్ à°•à°¿ వెళ్లాను. అక్కడో నాటకం వేశారు. అందులో జయప్రకాష్ రెడ్డి చేశాడు. ఎమ్మెల్యే  à°®à°¾à°§à°µà°°à±†à°¡à±à°¡à°¿ నా స్నేహితుడు. జయప్రకాష్ రెడ్డికి ఏదైనా మంచి పాత్ర ఉంటే చూడమన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ à°•à°¿ పిలిపించి, రిహార్శల్ చేయించి, 'బ్రహ్మపుత్రుడు' సినిమాలో జయప్రకాష్ రెడ్డితో విలన్ పాత్ర వేయించాను. అప్పట్లో ఎవరైనా నాటకాలేస్తుంటే చూసేవాణ్ణి. ప్రతిభ ఉన్న కళాకారులను సినిమాలకు అవకాశం ఇచ్చేవాణ్ణి. కోడి రామకష్ణగారు కూడా అలా చేసిన సందర్భాలున్నాయి.

పరభాషల తారల హవా ఎక్కువయ్యింది కదా? ఇది మంచి పరిణామమేనా?

రాను రాను నిర్మాతలు కథ ఏంటి? అని అడగడంలేదు. బడ్జెట్ ఎంత? అని అడుగుతున్నారు. దాంతో పరిస్థితులు మారాయి. మురళీమోహన్ లేదా శరత్ బాబులాంటివాళ్లను తండ్రి పాత్రలకు తీసుకుందామంటే.. 'పాత ఆలోచనలు.. కొత్తగా ఆలోచించాలి' అంటారు. తమిళ ప్రభు, సత్యరాజ్ ని తీసుకుందామంటారు. లేకపోతే ముంబయ్ నుంచి తీసుకువస్తున్నారు. ఇతర రంగాల నుంచి ఆర్టిస్టులు తీసుకు రావడమే బడ్జెట్ పెరగడానికి కొంత కారణం అవుతోంది. మనకు నటులు లేరని కాదు.. ఉన్నారు. కాకపోతే, వెతకాలి. పరభాషల నుంచి తీసుకొచ్చి కోటి రూపాయల వరకు పారితోషికం ఇచ్చేస్తున్నాం. మన ఆర్టిస్టులను పెట్టుకుంటే పాత కంపు వస్తుందని ఎక్కువ పారితోషికం ఇచ్చి పరభాషలవాళ్లని తీసుకొస్తున్నారు. కళకు భాషాభేదం లేకపోయినా, మన వాళ్లని కాకుండా... ఇతర భాషలకి చెందిన వారితో చేయాలనుకోవడం మంచి పరిణామం కాదు.

ఎంతోమందిని స్టార్లుగా తీర్చిదిద్దిన మీరు మీ అబ్బాయి దాసరి అరుణ్ కుమార్ కెరీర్ విషయంలో మాత్రం అలా ఎందుకు చేయలేకపోయారు?

అరుణ్ యాక్ట్ చేస్తానంటే చాలా క్యాజువల్ గా తీసుకుని సినిమా మొదలుపెట్టాను. రాఘవేంద్రరావుగారిని అడిగితే, అటూ ఇటూ అయితే అని భయపడ్డారు. బి. గోపాల్ ని అడిగితే అదే పరిస్థితి. తర్వాత ఇద్దరు ముగ్గుర్ని అడిగితే, వెనక్కి తగ్గారు. అప్పటికి నా చేతిలో మూడు సినిమాలున్నాయి. కానీ, అరుణ్ సినిమాని నేనే డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. అప్పటికే బిజీగా ఉండటంతో అరుణ్ తో సినిమాని మామూలుగా తీసేశాను. సరిగ్గా ప్రమోట్ కూడా చేయలేదు. ఆ తర్వాత చేసిన 'చిన్నా' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత తను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు తను హీరోగా ఓ సినిమా చేయనున్నాను. 'నేరం' అనే మలయాళ సినిమాకి రీమేక్ అది. నా దగ్గర చాలాకాలంగా కో-డైరెక్టర్ గా పని చేసిన రవికుమార్ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేయనున్నాను. నా పుట్టినరోజు తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది. అలాగే, వేరే నిర్మాతలు కూడా అరుణ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈసారి జాతీయ అవార్డులు మనవారికి కూడా దక్కాయి కదా.. మీ ఫీలింగ్?

'నా బంగారు తల్లి' కి రాజేష్ టచ్ రివర్ కి జాతీయ అవార్డు వచ్చింది. గత మూడేళ్లుగా మనకు జాతీయ అవార్డు రాలేదు. అందుకే, అతన్ని నా పుట్టినరోజు నాడు సత్కరించనున్నాను. ఇక, నందగోపాల్ గారు కొంతమందికి ఇష్టుడు, కొంతమందికి అయిష్టుడు. అది పక్కన పెడితే ఈ వయసులో ఆయనో గొప్ప అవార్డు సాధించారు. మరో పదేళ్లు ఇంకా ఆనందంగా బతకడానికి మంచి వరం ఈ అవార్డు. మరి అలాంటివారిని ప్రత్యేకంగా గౌరవించాల్సిన మన పరిశ్రమ ఏమైంది? చాంబర్, కౌన్సిల్స్ ఎందుకు? ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి చేయడానికా?

రాష్ర్ట ఎన్నికల గురించి?

దూరంగా ఉండాలనుకున్నాను. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అంత బాగా లేదు. ఎవరెప్పుడు ఏ పార్టీకి మారతారో తెలియదు. వారి సిద్ధాంతాలు తెలియవు. ఇవాళ ఒక పార్టీకి సపోర్ట్ చేసి, రేపు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తారు. పదవే ప్రధానంగా సాగుతున్న ఎన్నికలవి. వేలంవెర్రిలా తయారైంది.

మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?

మే 4న ప్రకటిస్తా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !