View

ఇంటర్వ్యూ - గుణ్ణం గంగరాజు

Tuesday,April29th,2014, 05:19 AM

'బేనర్ వేల్యూ' అంటారు.. కొన్ని సంస్థలు మాత్రమే à°† విలువను తెచ్చుకోగలుగుతాయి. అలాంటి వాటిలో 'జస్ట్ ఎల్లో మీడియా' à°’à°•à°Ÿà°¿. 'లిటిల్ సోల్జర్స్', 'ఐతే', 'అనుకోకుండా à°’à°• రోజు', 'అమ్మ చెప్పింది'.... ఇలా తమ సంస్థపై గుణ్ణం గంగరాజు తీసినవన్నీ 'నీట్ సినిమాలే'. దర్శక, నిర్మాతగా ఆయన శైలి ప్రత్యేకం. ఇంటిల్లిపాదికీ 'అమృతం'లాంటి చక్కని కామెడీ సీరియల్ ని అందించి, బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు గంగరాజు. ప్రస్తుతం 'అమృతం - చందమామలో' సినిమాని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. à°ˆ సినిమా కొంత శాతం  స్పేస్ లో సాగుతుంది. స్పేస్ అంటే హాలీవుడ్ కే సాధ్యం అనే భావనని à°ˆ  'అమృతం - చందమామలో' బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు. à°ˆ టెక్నికల్ వండర్ మే 9à°¨ ప్రేక్షకుల ముందుకు రానుంది. à°ˆ సందర్భంగా గుణ్ణం గంగరాజుతో జరిపిన ఇంటర్వ్యూ...

'అమృతం - చందమామలో'  విశేషాలేంటి?
టోటల్ గా డిజిటల్ లో మేం తీసిన మొదటి సినిమా ఇది. రెడ్ ఎపిక్ కెమెరాతో తీశాం. 5కె రిజల్యూషన్ లో తీశాం. దాంతో అవుట్ పుట్ వండర్ ఫుల్ గా ఉంటుంది. అంతకు ముందు డిజిటల్ అంటే చీప్ అనుకునేవాళ్లం. కానీ, అది కూడా ఖరీదే. కెమెరా చాలా ఎక్స్ పెన్సివ్. క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫిల్మ్ తో తీసినదానికన్నా క్వాలిటీ బాగుంటుంది. ఈ 'అమృతం - చందమామలో' సినిమాకి డిజిటల్ విధానం చాలా ఉపయోగపడింది. ఎందుకంటే, దాదాపు 60 నిమిషాలకు పైగా గ్రాఫిక్స్ ఉన్నాయి. రెగ్యులర్ ఫార్మట్ లో షూట్ చేసి, మళ్లీ దాన్ని డిజిటల్ కి మార్చడం అంటే చిన్న విషయం కాదు. క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. అందుకే సినిమా మొత్తం డిజిటల్ లో తీశాం.

ఈ సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టడానికి కారణం ఏంటి?
నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. ఏడాదిన్నర క్రితం షూటింగ్ ప్రారంభించాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకే ఏడెనిమిది నెలలు పట్టింది.

బుల్లితెర కోసం 'అమృతం'.. ఇప్పుడు వెండితెర కోసం  'అమృతం - చందమామలో'.. మరి.. à°ˆ అమృతం ఎలా ఉంటుంది?
టీవీ కోసం మేం చేసిన 'అమృతం' చాలా సక్సెస్ అయ్యింది. అప్పటికి టీవీ సీరియల్స్ అంటే  ఏడవాల్సిందే అనే ఫీలింగ్ ని బ్రేక్ చేసిన సీరియల్ అమృతం. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుని, నంబర్ వన్ అనిపించుకుంది. ఇంకా కొనసాగించమన్నారు కానీ, బాగా సాగుతున్నప్పుడే ఆపివేయడం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే, అప్పటికే 300 కథలు చూపించాం. షో రన్ చేయాలి కాబట్టి, ఏవేవో కథలు కల్పించేస్తే వచ్చిన పేరు పోతుంది. అందుకని ఆపేశాం. à°† 'అమృతం'ని ఆదర్శంగా తీసుకుని, వినోద ప్రధానంగా సినిమా తీయాలనుకుని à°ˆ 'అమృతం - చందమామలో' సినిమాకి శ్రీకారం చుట్టాం. దీన్ని బుల్లితెరపై తీయలేం. ఎందుకంటే ఇది చాలా కాస్ట్ లీ సినిమా. ఒక్కో కాస్ట్యూమ్ ఖర్చే 25,000 రూపాయలు. 50 డ్రెస్ లు చేయించాం. హెల్మెట్స్ కొన్ని ఇక్కడ, కొన్ని ముంబయ్ లో చేయించాం. కొన్ని మెటీరియల్స్ ఇక్కడ దొరకలేదు. ఒక్కో ఆర్టిస్ట్ à°•à°¿ డ్రెస్ వేయడానికి నలుగురు అసిస్టెంట్లు ఉండాలి. డ్రెస్ వేసిన తర్వాత ఒక్కొక్కరికి హెల్మెట్ ఫిట్ చేయడానికి టైమ్ తీసుకునేది. రెండు కెమెరాలు, రెండు యూనిట్లు, 25 మంది నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు.. ఇలా క్లయిమాక్స్ చిత్రీకరణకు మాత్రమే చాలా బడ్జెట్ అయ్యింది. మొత్తం మీద ఇది à°…à°‚à°¤ సులువైన సినిమా కాదు.

చందమామలో సన్నివేశాల గురించి?
హాలీవుడ్ చిత్రం 'గ్రావిటీ' స్పేస్ లోనే సాగుతుంది. ఈ సినిమాలోనూ చందమామలో సన్నివేశాలున్నాయి. స్పేస్ లో సాగే ఆ సన్నివేశాలు పిల్లలను, పెద్దలను థ్రిల్ కి గురి చేస్తాయి. దాదాపు 1000 నిమిషాల పాటు స్పేస్ లో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి. దాదాపు ఆరేడు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీశాం.

చందమామలో ఎంత శాతం సినిమా ఉంటుంది?
30 నుంచి 40 శాతం సినిమా చందమామలోనే ఉంటుంది. దానికోసమే కాకుండా ఇతర సన్నివేశాలకు కూడా గ్రాఫిక్స్ వాడాం.

ఈ సినిమాలో ఎన్ని ప్రధాన పాత్రలు ఉంటాయి?
ప్రధానంగా ఆరు ముఖ్య పాత్రలు ఉంటాయి. అమృతం, అంజి, అప్పాజీ, సర్వం, శాంత, సంజీవి, ఉమాదేవి..ఇలా ఆరేడు ముఖ్య పాత్రలు ఉంటాయి.  à°ˆ పాత్రలు కాకుండా ఇంకా విలన్ పాత్రధారులు ఉంటారు. à°“ యువజంట ఉంటుంది. 'అమృతం' ఎక్కడైతే ముగిసిందో అక్కణ్ణుంచి  'అమృతం - చందమామలో' మొదలవుతుంది.

కామెడీ సినిమాకి 7, 8 కోట్లు బడ్జెట్ అవసరమా?
ఇది డెఫినెట్ à°—à°¾ కాస్ట్ లీ మూవీయే. వినోద ప్రధానంగా సాగే సినిమాకి భారీ బడ్జెట్ అవసరమా? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, నా దృష్టిలో నవ్వనేది చీప్ కాదు. ఖరీదుగా కూడా ఉండొచ్చు. చవకబారు నవ్వుకి మేం దూరం. ఎందుకంటే, బూతుంటేనే నవ్వొస్తుందా? నీట్ à°—à°¾ కూడా నవ్వుకోవచ్చు కదా. అందుకే అంటున్నా..కామెడీ చవకబారుగా ఉండనవసరంలేదు. చవకగానూ ఉండక్కర్లేదు. అందుకే, కామెడీగా సాగే సినిమా అయినా చవకగా తీయాలనుకోలేదు. మా 'అమృతం' కామెడీగా సాగుతుంది. కానీ, చవకబారు కామెడీ ఉండదు. అయినప్పటికీ ఏ సీరియల్ సాధించనంత విజయాన్ని  à°† సీరియల్ సాధించింది. అందుకే, కామెడీ సినిమా విజయం సాధించాలంటే బూతులే అవసరం లేదంటున్నా.

గ్రాఫిక్స్ ఎక్కడ చేయించారు?
హైదరాబాద్ లోనే చేయించాం. ఈసిఎస్, లాఫింగ్ టవర్స్ అనే యానిమేషన్ కంపెనీ కలిసి చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకులను మంచి అనుభూతికి గురి చేయడం ఖాయం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !