View

ఇంటర్వ్యూ - డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Tuesday,April29th,2014, 03:07 PM

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు తీసే దర్శకునిగా శేఖర్ కమ్ములకి మంచి పేరుంది. 'లీడర్' ద్వారా దమ్మున్న పాలిటికల్ సినిమా తీయగలనని కూడా నిరూపించుకున్నారు. 'ఆనంద్', 'గోదావరి' లాంటి చిత్రాల్లో స్ర్తీ పాత్రలను ఎంతో బలంగా చూపించిన ఘనత శేఖర్ కి దక్కుతుంది. నేటి మహిళ ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండాలి? అనేది తన కథానాయికల పాత్రల్లో ఆవిష్కరిస్తుంటారు శేఖర్. ఆ విధంగా మహిళలకు స్ఫూర్తినిస్తుంటాయి శేఖర్ సినిమాలు. ఇప్పుడు కథానాయిక ప్రధానంగా సాగే 'అనామిక'ను తెరకెక్కించారు శేఖర్. హిందీలో విద్యాబాలన్ నటించిన 'కహానీ'కి రీమేక్ ఇది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్మలతో జరిపిన ఇంటర్వ్యూ...

రీమేక్ సినిమా చేయడం మీకిది తొలిసారి. అసలు ఈ సినిమా చేయాలనుకోవడానికి కారణం ఏంటి?
వాస్తవానికి ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగినప్పుడు స్ర్తీ సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ, కథ మాత్రం నా దగ్గర లేదు. ఆ సమయంలోనే 'కహానీ' రీమేక్ హక్కులు తమ వద్ద ఉన్నాయంటూ, నా దర్శకత్వంలో తీయాలనుకుంటున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. ఇది కూడా మహిళా ప్రధానంగా సాగే సినిమా కావడంతో అంగీకరించాను.

ఈ సినిమా ప్రపోజల్ రాకముందు 'కహానీ' చూశారా?
లేదు. ఒప్పుకున్న తర్వాత చూశాను. అది కూడా ఒకే ఒక్కసారి మాత్రమే. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు నేనే రచయితను. కానీ, యండమూరి వీరేంధ్రనాథ్ గారి సహాయం తీసుకుని 'కహానీ' కథ, కథనంలో చాలా మార్పులు చేసి, తెలుగు వెర్షన్ ని తీశాను.

హిందీలో కథానాయిక గర్భవతి. ఆ పాత్ర పట్ల ప్రేక్షకులు జాలి కలగడానికి అదో కారణం అయ్యింది. మరి.. తెలుగులో కథానాయికను గర్భవతిగా చూపించకపోడానికి కారణం?
ప్రేక్షకులు కథానాయిక ప్రాతతో కనెక్ట్ కావడానికి ఆమెను గర్భవతిగానే చూపించాల్సిన అవసరం లేదనిపించింది. అది కూడా తన భర్తను వెతికే క్రమంలో తను గర్భవతిని అని కథానాయిక అసత్యం పలికి, సమాజాన్ని మోసం చేయడాన్ని నేనిష్టపడలేదు. అందుకే గర్భవతిగా చూపించలేదు. తన భర్త కోసం వెతికే క్రమంలో ఓల్డ్ సిటీ, ఇతర ప్రదేశాల్లో నాయిక పడే పాట్లు ప్రేక్షకులను కదిలిస్తాయి. ఆ సన్నివేశాలు ఎంతో ఉదాత్తంగా ఉంటాయి.

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా చేశారు. రెండు భాషల్లోనూ మార్కెట్ ఉంది కాబట్టే నయనతారను తీసుకున్నారా?
అనామిక పాత్రకు తనైతేనే కరెక్ట్ అనిపించింది. నా నమ్మకం నిజమైంది. నయనతార అద్భుతంగా నటించింది.

కానీ, ప్రమోషన్ విషయంలోనే నయనతార చేదు అనుభవం మిగిల్చినట్లుంది?
ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడన్నది నయనతార పాలసీ. ప్రమోషన్ లో పాల్గొనని తను ముందే చెప్పింది. కొంతమంది సినిమాని తమ బాధ్యతలా భావించి, నటించడం నుంచి ప్రచారం వరకు నిమగ్నమవుతారు. కానీ, కొంతమంది కేవలం ఉద్యోగంలా భావిస్తారు. యాక్ట్ చేశాం.. పారితోషికం తీసుకున్నాం. అంతటితో మన పనైపోయిందనుకుంటారు. నయనతార ఈ టైపే.

ఓల్డ్ సిటీ నేపథ్యంలో సినిమా సాగుతుంది కదా.. తమిళ ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుంది?
తమిళ అమ్మాయికి ఇక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే నేపథ్యంలో సినిమా ఉంటుంది. 'అనామిక' యూనిర్శల్ కథాంశం కాబట్టి, ఏ భాషకైనా సరిపోతుంది.

తొలిసారి రీమేక్ సినిమా చేశారు.. కీరవాణితో చేయడం కూడా ఇదే తొలిసారి కదా.. ఎలా అనిపించింది?
కీరవాణిగారితో సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. ఇప్పటికే పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి స్కోప్ ఉన్న సినిమా. ఆ పరంగా కూడా సినిమా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

మీ గత చిత్రాల్లా ఈ సినిమా కూడా ఆలస్యం కావడానికి కారణం?
నిజమే. నా సినిమాలు చాలావరకు ఆలస్యం అవుతాయి. ఈ సినిమా ఆలస్యానికి గల కారణం తొలిసారి నేను ఓ కార్పొరేట్ సంస్థ తో కలిసి చేయడమే. అంతకు మించి వేరే కారణాలేవీ లేవు. బాలీవుడ్ లో కార్పొరేట్ సంస్థలు సినిమాలు నిర్మిస్తున్నాయి. తెలుగులో కూడా ఆ సంస్థల జోరు ఆరంభమైతే బాగుంటుంది. ఎందుకంటే, కార్పొరేట్ సంస్థతో కలిసి సినిమా చేయడం మంచి అనుభవాన్నే మిగిల్చింది.

ఇక రీమేక్ సినిమాలు చేయనని అన్నారట?
అలా అనలేదు. రీమేక్ సినిమా అంటే కథ, కథనాలు రెడీమేడ్ గా ఉంటాయి. మనకు నచ్చినట్లుగా కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. త్వరగా సినిమాని పూర్తి చేసేయొచ్చు. కానీ, ఓ స్ర్టయిట్ సినిమాకి పడ్డంత కష్టం ఈ రీమేక్ కి పడ్డాను. ఇంత కష్టంతో ఒక స్ర్టయిట్ సినిమా చేసి ఉండొచ్చుగా అనిపించింది. అంతే తప్ప రీమేక్ చిత్రాలు చేయననలేదు. ఏదేమైనా ఒక కొత్త జానర్ లో సినిమా చేసిన సంతృప్తి ఉంది. సినిమా బాగా వచ్చింది. నిడివి కూడా రెండు గంటలే. ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తుంది. ఒక మంచి సినిమా చేశానన్న తృప్తి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !