View

ఇంటర్వ్యూ - హీరో అల్లు శిరీష్

Tuesday,April29th,2014, 04:28 PM

'గౌరవం' చిత్రం ద్వారా కథానాయకునిగా రంగప్రవేశం చేసిన అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'కొత్త జంట' మే 1న విడుదల కానుంది. తొలి చిత్రం 'గౌరవం' ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, నటుడిగా శిరీష్ మంచి మార్కులే సంపాదించుకున్నాడు. మలి చిత్రంతో విజయాన్ని కూడా చవి చూస్తాననే నమ్మకం వ్యక్తం చేశాడు శిరీష్. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ 'కొత్త జంట' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. ఇక, శిరీష్ తో జరిపిన ఇంటర్వ్యూలోకి ఎంటరవుదాం...

'కొత్త జంట'లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో టీవీ యాంకర్ పాత్ర చేశాను. బేసిక్ గా ఈ యాంకర్ చాలా స్వార్థపరుడు. ఓ స్వార్థపరుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అతని ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉంటుంది? అనేది కథాంశం. నా పాత్ర చాలా సరదా సరదాగా ఉంటుంది. కామెడీ టచ్ తో సాగుతుంది.

కామెడీ చేయడం కష్టమంటారు కదా.. ఎలా అనిపించింది?
మనలో సెన్సాఫ్ హ్యుమర్ ఉంటే.. కామెడీ పండించడం అంత కష్టమేం కాదు. రియల్ లైఫ్ లో నేను చాలా సరదాగా ఉంటా. కామెడీని ఆస్వాదిస్తా. నేనూ కామెడీ చేస్తా. అందుకే, స్ర్కీన్ పై ఆవిష్కరించడానికి పెద్దగా కష్టపడలేదు. ఈ సినిమాలో నా పాత్ర తీరుతెన్నులు, హవభావాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి.

మారుతి దర్శకత్వంలో సినిమా చేయడం గురించి?
ఈ సినిమాకన్నా ముందే నాకు మారుతీతో పరిచయం ఉంది. ఆ మాటకొస్తే ఈ సినిమా కోసం చేసినవారందరూ నాకు తెలుసు. అందుకని, షూటింగ్ మొత్తం చాలా ఎంటర్ టైనింగ్ గా సాగింది. మారుతీతో సినిమా చేయడం కూడా మంచి అనుభూతిని మిగిల్చింది.

చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ 'ఇటు అమలాపురం..' రీమిక్స్ చేయాలన్నది ఎవరి ఆలోచన?
కథానుసారం ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. కొత్తగా చేయించడమెందుకు? ఏదైనా సూపర్ హిట్ సాంగ్ ని రీమేక్ చేద్దామని మారుతి అన్నారు. 'ఇటు అమలాపురం...' అయితే బాగుంటుందని ఆ పాట చేయించాం. ఆ పాట సినిమాకి ఆదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశారట... కారణం ఏంటి?
మా సంతృప్తి మేరకు కొన్ని సన్నివేశాలు రాకపోవడంతో మళ్లీ తీసాం. అలాగే, సినిమా మొత్తం చూసిన తర్వాత సంపూర్ణేష్ బాబు ట్రాక్ అనవసరం అనిపించింది. ఆ ట్రాక్ ని తొలగించాం. ఈ ట్రాక్ తొలగించాలన్నది ఏ ఒక్కరి నిర్ణయమో కాదు. చిత్రబృందం తీసుకున్న నిర్ణయమే.

మీ నాన్న అల్లు అరవింద్ ఇన్వాల్వ్ మెంట్ ఎంతవరకు ఉంది?
నాన్నగారి ఇన్ వాల్వ్ మెంట్ అస్సలు లేదు. కథ ఫైనలైజ్ అయిన తర్వాత షూటింగ్ సమయంలో నాన్నగారు ఇన్వాల్వ్ కాలేదు. ఎడిటింగ్ సమయంలో మాత్రం నాన్నగారు చెప్పిన సలహాలను తీసుకున్నాం.

మీ తొలి చిత్రం 'గౌరవం' ఆశించిన ఫలితం ఇవ్వని నేపథ్యంలో ఈ మలి చిత్రంపై మీ అంచనాలు?
'గౌరవం' కథ బాగున్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గడంవల్లే ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ, 'కొత్త జంట'లో ఆ కొరత ఉండదు. కథ, కథనం బాగుంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ మెండుగా ఉన్నాయి.

మీ కుటుంబానికి చెందినవారెవరైనా ఈ సినిమాని చూశారా?
బన్నీ చూశాడు. ఓ ప్రేక్షకుడిగా ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేశాడు. సినిమా బాగుందని ఫీడ్ బాక్ కూడా ఇచ్చాడు. ఈ వేసవికి చాలా మంచి సినిమా అవుతుందని చెప్పాడు.

ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
ఓ నటుడిగా నిరూపించుకోవడానికి అవకాశం ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. బలమైన కథాంశాలతో రూపొందించే సినిమాలు చేయాలని ఉంది. ఏది చేసినా యూత్ ని ఆకట్టుకునేలా చూసుకుంటాను.

నిర్మాణ బాధ్యతలు చేపట్టాలని ఉందని గతంలో అన్నారు..?
మరో ఐదారేళ్ల తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెడతా. ఎందుకంటే, సినిమా నిర్మాణం అనేది సులువు కాదు. దానికి చాలా అనుభవం కావాలి. ఆ అనుభవం సంపాదించుకున్న తర్వాత నిర్మాణం చేపడతా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !