View

ఇంటర్వ్యూ - డా.కె.వి.సతీష్ (యమలీల 2) హీరో

Wednesday,May07th,2014, 03:55 AM

'యమలీల'...తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన టైటిల్ ఇది. తెలుగు తెరపై ఇప్పటివరకు 'యమ'సందడి బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ సందడిని ప్రేక్షకులు చూడబోతున్నారు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం 'యమలీల 2' చిత్రం చేస్తున్న విషయం తెలిపిందే. వ్యాపార రంగంలో దిగ్విజయంగా సాగుతున్న డా. కె.వి. సతీష్ ఈ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయమవుతున్నారు. యముడి పాత్రను కలక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, చిత్రగుప్తుని పాత్రను డా. బ్రహ్మానందం పోషిస్తున్నారు. ఇప్పటికి ఈ చిత్రం షూటింగ్ 75 శాతం పూర్తయ్యింది. ఈ సందర్భంగా హీరో కె.వి. సతీష్ తో జరిపిన ఇంటర్వ్యూ...

తొలి సినిమానే ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకునితో చేయడం ఎలా అనిపిస్తోంది?
అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో అద్భుత చిత్రాలు అందించిన దర్శకుడాయన. à°ˆ సినిమా అంగీకరించినప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డిగారి ట్రాక్ రికార్డ్ తెలుసుకున్నా. ఆయన తీసిన 40 సినిమాల్లో 90 శాతం ఘనవిజయం సాధించగా, మిగిలినవి యావరేజ్ à°—à°¾ ఆడాయని తెలిసింది. ఎక్కువ శాతం హిట్ చిత్రాలు చేసిన  ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం మంచి అనుభూతినిస్తోంది. ఇక అయిదువందలకు పైగా చిత్రాల్లో నటించిన మోహన్ బాబుగారు, గిన్నిస్ రికార్డ్ సాధించిన బ్రహ్మానందంలాంటి గొప్ప నటుల కాంబినేషన్ లో నటించడం ద్వారా à°ˆ సినిమా నాకో మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ లా ఉపయోగపడుతోంది.

వ్యాపారవేత్తగా మంచి అనుభం సంపాదించుకున్న మీకు యాక్టింగ్ ఎలాంటి అనుభూతినిస్తోంది?
వ్యాపార రంగంలో నేను అగ్ర స్థాయికి చేరుకోవడానికి చాలా కృషి చేశాను. పోటీ బాగా ఉండటంతో ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి మరింత కృషి చేయాల్సి వస్తోంది. యాక్టింగ్ కూడా అంతే. ఇక్కడ కూడా భారీ ఎత్తున పోటీ ఉంటుంది. నాకు నటన అంటే మమకారం. ఏ సినిమా చేసినా శాయశక్తులా కష్టపడి చేస్తా. నా నటన ద్వారా కనీసం 50, 60 శాతం మందిని అయినా ఆకట్టుకోగలిగితే అదే చాలు. అప్పుడు నేను బాగా నటించినట్లే లెక్క.

నటునిగా మారిన వైనం గురించి చెబుతారా?
నాకు చిన్నప్పట్నుంచీ వ్యాపార రంగం అంటే ఇష్టం. ఆ రంగంలో 'ది బెస్ట్' అనిపించుకోవాలనుకున్నా. అనుకున్నది సాధించా. వ్యాపార రంగం అంటే ఎంత మక్కువో యాక్టింగ్ అంటే కూడా అంతే మక్కువ. నటుడిగా రంగప్రవేశం చేయాలనుకుంటున్న సమయంలో లక్కీగా 'యమలీల 2'కి అవకాశం వచ్చింది.

గ్లామర్ ఫీల్డ్ ఎలా అనిపిస్తోంది?
వ్యాపార రంగం, సినిమా రంగానికి దగ్గర పోలికలుంటాయి. కాకపోతే, సినిమా గ్లామర్ తో కూడుకున్నది. వ్యాపారవేత్తలకన్నా సినిమా తారలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే పోటీ అనేది రెండు రంగాల్లోనూ మెండుగా ఉంటుంది.వ్యాపారంలో కస్టమర్స్ ని, సినిమాల్లో ప్రేక్షకులను సంతృప్తి పరచాలి. అలాగే, ఆర్టిస్ట్ అంటే ఫిట్ గా ఉండాలి. శరీరాకృతిని ఎప్పుడూ మెయిన్ టైన్ చేయాలి. లేకపోతే, నిలదొక్కుకోవడం కష్టం.

సినిమా రంగం గురించి మీ అభిప్రాయం?
ఈ ప్రప్రంచంలోనే అతి కష్టమైన పని యాక్టింగ్ అని నా అభిప్రాయం. ఎందుకంటే, భిన్న అభిరుచులు ఉన్న ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. వాళ్లందర్నీ మెప్పించగలగాలి. ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకూడదు. అలాగే, సినిమా తారలు ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటం కోసం ఎన్నో కష్టాలు పడాలి. కొన్ని త్యాగాలు కూడా చేయాలి. దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరంగా చూసేవారికి సినిమా ప్రపంచం అందంగా కనిపిస్తుంది. నిజంగా అందమైనదే. కానీ, ఇది ఈజీ జాబ్ అయితే కాదు.

ఒక సినిమా విజయానికి ముఖ్య కారణాలేంటి అనుకుంటున్నారు?
కథ, నటీనటులు, పాటలు.. ఇలా అన్నీ కుదరాలి. అలాగే ఏ సినిమా విజయానికైనా సమష్టి కృషే కారణం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !