View

ఇంటర్వ్యూ - డైరెక్టర్ మారుతి

Wednesday,May14th,2014, 07:44 AM

''యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలనే ఆకాంక్షతో చేసిన సినిమా 'కొత్త జంట'. నా టార్గెట్ నెరవేరింది'' అన్నారు మారుతి. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రం విడుదలై నేటి (14.05.)తో రెండు వారాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మారుతి తన మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు.

రేపట్నుంచి లాభాల బాటలో 'కొత్త జంట'
ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు ఇలా పాత్రికేయులను కలవడానికి కారణం ఉంది. జెన్యూన్ రిపోర్ట్ తో నా మనోభావాలు పంచుకోవాలనుకున్నాను. ఇప్పుడు రెండు వారాలు పూర్తయ్యింది. వసూళ్లు బాగున్నాయి. రేపట్నుంచి లాభాలు అందుతాయి. పంపిణీదారులందరూ ఈ సినిమా విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నారు. మారుతి సినిమా అంటే ఇలానే ఉంటుంది? అనుకున్నవారిని ఈ సినిమా ఆశ్చర్యపరిచింది. వారి ఊహలకు భిన్నంగా ఉంది. నా గత చిత్రాల స్థాయిలో కామెడీ ఉంటుందని ఆశించారు. కానీ, ఈ కథలో అంత కామెడీ లేదు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూడాలనే ఆశయంతో ఈ సినిమా చేశాను. మొన్నటి వరకు యువత చూశారు. ఇప్పుడు కుటుంబ ప్రేక్షకులు కూడా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది.

బి,సి సెంటర్స్ లో కూడా...
ఇందులో హీరో స్వార్థపరుడు. 'సెల్ ఫిష్' అనే పదం వాడటంవల్ల బి,సీ సెంటర్స్ వాళ్లు పెద్దగా కనెక్ట్ కారనుకున్నారు. కానీ ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు లాంటి ఏరియాల్లోనూ ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. క్లీన్ సినిమా కావడంతో కుటుంబ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

తెలివిగా తీశానని చరణ్ అన్నాడు
విడుదలకు ముందు ఈ సినిమాని రామ్ చరణ్ చూశాడు. చిన్నప్పట్నుంచీ తను నాకు తెలుసు. మేమిద్దరం కలిసి సినిమాలు కూడా చూసేవాళ్లం. 'కొత్త జంట' సినిమాని తను చూసి, 'భలే తెలివిగా తీశావు' అన్నాడు. బన్నీకి కూడా ఈ సినిమా బాగా నచ్చింది.

వేసవిలో అల్లుకి ఆనందం...
వేసవిలో విడుదలైన అల్లు అర్జున్ 'రేసు గుర్రం', అల్లు శిరీష్ 'కొత్త జంట' రెండూ హిట్ అయ్యాయి. ఆనందంగా ఉంది. మామూలుగా మెగా హీరోల సినిమాలంటే రెండు, మూడు రోజులు అభిమానులు చూస్తారు. సినిమా బాగుంటే ఆ తర్వాత ఇతర ప్రేక్షకులు కూడా చూస్తారు. 'రేసు గుర్రం'లో బన్నీ ఎనర్జిటిక్ పర్ఫా ర్మెన్స్ అందరికీ నచ్చింది. 'కొత్త జంట'లో శిరీష్ బాగున్నాడంటున్నారు. నటుడిగా ప్రేక్షకులు తనను పాస్ చేశారు.

వెంకటేష్ 'రాధ' అందుకే ఆగింది!
వెంకటేష్ హీరోగా 'రాధ' చిత్రం రూపొందించాల్సి ఉంది. అయితే, కథ రెడీ కావడానికి ఇంకా టైమ్ పట్టేట్లుంది. అప్పటికే వెంకటేష్ నాలుగు నెలల వెయిట్ చేశారు. ఇంకా వెయిట్ చేయించడం భావ్యం కాదనిపించింది. కథ కు ఇంకా టైమ్ పడుతుందన్నాను. అందుకే, ఆయన 'దృశ్యం' కమిట్ అయ్యారు. నితిన్ కి ఓ స్టోరీ లైన్ చెప్పాను. తనకు నచ్చింది. అలాగే ప్రస్తుతం రెండు, మూడు కథలు తయారు చేస్తున్నాను. నా తదుపరి చిత్రం ఏంటి? అనేది త్వరలో తెలియజేస్తా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !