View

ఇంటర్వ్యూ - కింగ్ నాగార్జున

Tuesday,May20th,2014, 05:19 AM

'ఇప్పటివరకు మేం నిర్మించిన చిత్రాలన్నీ 'అన్నపూర్ణ స్టూడియోస్' సంస్థ పేరుంటుంది. కానీ, ఇకనుంచి మేం నిర్మించే చిత్రాలన్నీ'అక్కినేని ఫ్యామిలీ' సంస్థపై ఉంటాయి'' అన్నారు నాగార్జున. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు భౌతికంగా మాత్రమే లేరని, ఆయన ఇంకా బతికున్నట్లే అనిపిస్తోందని నాగ్ అన్నారు. తండ్రి, తనయుడు నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన 'మనం' చిత్రం à°ˆ నెల 23à°¨ విడుదల కానుంది. విక్రమకుమార్ దర్శకత్వంలో రూపొందించిన à°ˆ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. à°ˆ సందర్భంగా నాగార్జున తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు తెలుసుకుందాం... ఇన్నాళ్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ పై సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అని బేనర్ పేరు  మార్చడానికి కారణం ఏంటి?
నాన్నగారి చివరి రోజుల్లో మేం ఆయనతో ఎక్కువగా గడిపేవాళ్లం. దాదాపు మూడు నెలలు ఆయన్ను చాలా దగ్గరగా చూశాం. ఈ నేపథ్యంలో మా కుటుంబ సభ్యులం మరింత దగ్గరయ్యాం. మా అనుబంధం మరింత బలపడడానికి కారణం నాన్న. కుటుంబ విలువలు, అనుబంధాలను ఆయన్ను చూసే నేర్చుకున్నాం. అందుకే, ఇక నుంచి మేం ఏ సినిమా తీసినా 'అక్కినేని ఫ్యామిలీ' సంస్థ పైనే. 'మనం' చిత్రం ఆరంభమైన వైనం గురించి?
మూడు తరాల నేపథ్యంలో సినిమా తీయాలనే కోరిక నాకెప్పట్నుంచో ఉంది. చాలా కథలు కూడా విన్నాను. కానీ, నచ్చలేదు. ఓ రోజు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఫోన్ చేసి, ఒక కథ ఉంది.. వినండన్నారు. విక్రమ్ కుమార్ వచ్చి కథ చెప్పాడు. నాకు చాలా నచ్చింది. కానీ, 'నీ ప్రతిభ నిరూపించుకుంటే ఈ సినిమా చేద్దాం' అని తనతో అన్నాను. తను నితిన్ తో తీసిన 'ఇష్క్' చిత్రాన్ని విడుదలకు ముందే నాకు చూపించాడు. ఆ సినిమా నాకు చాలా నచ్చింది. అందుకని తన దర్శకత్వంలో 'మనం చేద్దామని నిర్ణయించుకున్నాను. నాగేశ్వరరావుగారు ఈ కథ విని ఏమన్నారు?
నేను కథ విన్న తర్వాత నాన్నకు కూడా చెప్పమని విక్రమ్ తో అన్నాను. ఈ కథ విన్న తర్వాత నాన్న కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాలను తీసుకున్నాం. 'మనం' అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎవరిది?
ఈ కథ అనుకున్నప్పుడు విక్రమ్ కుమార్ 'హమ్' టైటిల్ ని పెడదామనుకున్నాడు. కానీ, నాన్నగారు 'మనం' అయితే బాగుంటుందన్నారు. మా అందరికీ బాగా నచ్చడంతో దాన్నే ఓకే చేశాం. ఈ చిత్ర కథకు వంద శాతం నప్పే టైటిల్ ఇది. మా కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు కలిసి చేసిన మొదటి సినిమా కాబట్టి, ఆ రకంగా కూడా ఈ టైటిల్ యాప్ట్ అయ్యింది.

ఇటు తండ్రి అటు తనయుడితో కలిసి చేసిన ఈ సినిమా మీకు చాలా ప్రత్యేకం కదా?
అవును. మా కుటుంబం మొత్తానికి ఇది చాలా చాలా ప్రత్యేకమైన సినిమా. ఓ ఎమోషనల్ మూవీ. నిజం చెప్పాలంటే దీన్నొక కమర్షియల్ మూవీగా భావించి చేయలేదు.ఇది ఎంత వసూలు చేస్తుందని లెక్కలేసుకోలేదు. ఇప్పటివరకు నా కెరీర్ మొత్తంలో నేను లెక్కలేసుకోకుండా చేసిన సినిమాలు పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కూడా ఆ జాబితాలోకి చేరుతుందనే నమ్మకం ఉంది.

వందేళ్ల కాలపరిమితిలో ఈ సినిమా జరుగుతుంది కదా.. ఆయా తరాన్ని చూపించడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు?
మూడు తరాలకు సినిమా లుక్ పరంగా తేడా చూపించడం కోసం ఛాయాగ్రాహకుడిగా పి.సి. శ్రీరామ్ అయితే బాగుంటుందనుకున్నా. అయితే, ఆయన బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయారు. దాంతో పి.ఎస్. వినోద్ అయితే బాగా చేయగలుగుతారని భావించి, ఆయన్ను తీసుకున్నాం. షూటింగ్ ఆరంభించే ముందు చాలా వర్కవుట్ చేశాం. 1920 నుంచి ఇప్పటివరకు సాగే కథ ఇది. అందుకని, బాగా హోమ్ వర్క్ చేశాం.

నాగేశ్వరరావుగారి పాత్ర ఎలా ఉంటుంది?
నాన్నగారిది చాలా కీలక పాత్ర. ఇంటర్వెల్ టైమ్ కి ఆయన పాత్ర తెరపైకి వస్తుంది. అప్పట్నుంచి సినిమా ముగిసే వరకు ఆయన పాత్ర ఉంటుంది.

నాగచైతన్య నటన గురించి?
తన పాత్రను విక్రమ్ కుమార్ రూపొందించిన విధానం చాలా బాగుంటుంది. చైతూ చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో నటుడిగా చైతూ మరింత ఎదిగాడు. ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటాడు.

అఖిల్ కూడా ఈ సినిమాలో నటించాడనే టాక్ ఉంది?
ఈ సినిమా చివరి రోజు షూటింగ్ అప్పుడు అఖిల్ కూడా సెట్స్ లో ఉన్నాడు. నా మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంతే కానీ అఖిల్ యాక్ట్ చేయలేదు.

అమితాబ్ బచ్చన్ నటించారు కదా.. దాని గురించి?
నాన్నకు అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు చూశారు. అందుకని, నాన్న చివరి సినిమాలో ఆయన నటిస్తే బాగుంటుందనుకున్నాం. అడగ్గానే అమితాబ్ కాదనకుండా చేశారు.

చివరిగా..బుల్లితెర గేమ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గురించి?
త్వరలో మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షో చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది.

'మనం' ఆడియో వేడుక చేయకపోవడానికి కారణం?
నాన్నగారు దూరమయ్యారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ టైమ్ లో ఫంక్షన్స్ చేసే మూడ్ లో లేం. ఎమోషనల్ గా మేం అందరం చాలా డిస్ర్టబ్డ్ గా ఉన్నాం. అందుకే ఆడియో ఫంక్షన్ చేయలేదు.

'మనం' ప్రీమియర్ షో స్ గురించి?
ఈ 22న ప్రసాద్ ఐమాక్స్ లో ఐదు స్ర్కీన్స్ లో ప్రీమియర్ ఏర్పాటు చేశాం. నాన్నగారి అభిమానులు, చిత్రపరిశ్రమకు చెందినవారు.. ఇలా చాలామంది హాజరవుతారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !