View

నాగేశ్వర్ ఎవరో మీరే తెలుసుకోండి - సమంత

Thursday,May22nd,2014, 01:54 PM

''ప్రతి సినిమాకీ నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్కువ ఉంది'' అన్నారు సమంత. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు నటించిన 'మనం' గురించే ఆమె ఈ విధంగా అన్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తనయుడు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి డా. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అక్కనేని నటించిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమాని మిస్ కాకూడదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. రేపు (23.05.14) ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సమంతతో జరిపిన ఇంటర్వ్యూ...

అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు నటించిన ఈ సినిమాలో నటించడం ఎలా అనిపిస్తోంది?
వాస్తవానికి à°ˆ సినిమాలో అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు నటించకపోయినా నేను ఒప్పుకుని ఉండేదాన్ని. ఎందుకంటే, ఇది చాలా మంచి సినిమా. ఇందులో నేను చాలా మంచి పాత్ర చేశాను. ఒకవేళ à°ˆ పాత్రను నేను కాకుండా వేరే హీరోయిన్ ఎవరైనా చేసి ఉంటే  చాలా బాధపడి ఉండేదాన్ని. à°ˆ సినిమాలో నాది ఫుల్ ప్లెడ్జెడ్ రోల్. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు విక్రమ్ à°•à°¿ ధన్యవాదాలు.

నాగేశ్వరరావుగారి కాంబినేషన్లో సినిమా చేయడం ఎలా అనిపించింది?
ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. నేను ఆయన్ని మొదట కలిసింది ఏ మాయ చేశావె' సక్సెస్ మీట్లో. ఆ వేడుకలో నాకు మొదటి కాంప్లిమెంట్ ఇచ్చింది ఆయనే. మామూలుగా కాంప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోను నేను. కానీ, నాగేశ్వరరావుగారు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందపడ్డాను. మనం సరైన వృత్తిలోనే ఉన్నామా? సరైన సినిమాలే చేస్తున్నామా? లేదా అని తర్జన భర్జన పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సమయంలో అభధ్రతాభావానికి గురయ్యేదాన్ని. అప్పుడు యూ ట్యూబ్ లో 'ఏ మాయ చేశావె' సక్సెస్ మీట్ పెట్టుకుని చూస్తాను. ఆ వేదికపై నాగేశ్వరరావుగారు మాట్లాడిన మాటలు చాలా ఇన్ స్పయిరింగ్ గా ఉంటాయి. ఇక, 'మనం' విషయానికొస్తే.. ఇందులో నాగేశ్వరరావుగారి కాంబినేషన్లో నాకు మూడు, నాలుగు సీన్స్ మినహా లేవు. అవి చేస్తున్నప్పుడు ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. నాగేశ్వరరావుగారంటే నాకు చాలా గౌరవం.

నాగేశ్వరరావుగారి పాత సినిమాలేమైనా చూశారా?
చూడలేదు. కానీ, ఆయన యాక్ట్ చేయడం రియల్ à°—à°¾ చూసే అదృష్టం నాకు దక్కింది. అందుకు ఆనందంగా ఉంది. నాగేశ్వరరావుగారికి  సెన్సాఫ్ హ్యుమర్ ఎక్కువ.

ట్రైలర్ లో 'నాగేశ్వర్' అంటున్నారు.. సినిమాలో నాగేశ్వర్ ఎవరు?
నాగచైతన్య మాత్రం కాదు.. ఎవరో నేను చెప్పను. రేపు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నాగచైతన్యతో మూడో సినిమా కాబట్టి, కంఫర్ట్ లెవల్ పెరిగి ఉండి ఉంటుందేమో?
ఏ మాయ చేశావె' అప్పుడు నాకు తెలుగు తెలియదు. పైగా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండేవి. దాంతో భయంతో చేశాను. ఆ సమయంలో నాగచైతన్య చాలా హెల్ప్ చేశాడు. ఆ తర్వాత మరో సినిమా చేశాం. ఇది మూడో సినిమా కాబట్టి, ఇద్దరి మధ్య కంఫర్ట్ లెవల్ పెరిగింది. మేమిద్దరం మంచి స్నేహితులయ్యాం. ఆ స్నేహం తాలూకు కెమిస్ర్టీ తెరపై కనిపిస్తుంది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మీ నటన గురించి మాట్లాడతారా? లేక గ్లామర్ గురించా?
'నా మొదటి సినిమా ఏ మాయ చేశావె'లో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. ఆ సినిమాలో నా లుక్ గురించి మాత్రమే కాదు.. నటన గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా, ఎక్కువ సినిమాల్లో నా గ్లామర్ గురించే మాట్లాడారు. బహుశా ఏడాదికి ఒకసారో, రెండుసార్లో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసే అవకాశం వస్తోంది. ఈ ఏడాది ఈ సినిమా వచ్చింది. ఇందులో నా నటన గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడతారు.

'మనంలో మీ పాత్ర గురించి?
రెండు పాత్రలు చేశాను. కృష్ణ పరిణతి చెందిన పాత్ర. తల్లి పాత్ర అన్నమాట. ఇంకో కేరక్టర్ ప్రియ బబ్లీగా ఉంటుంది. రెండు పాత్రలు ఒకదానికి ఒకటి పొంతన లేని విధంగా ఉంటాయి.

'మనం'కి సంబంధించి ప్రత్యేకమైన జ్ఞాపకం ఏదైనా ఉందా?
à°ˆ సినిమా మొత్తం à°“ మధురమైన జ్ఞాపకం.  ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు కలిసి నటించిన సినిమాలో యాక్ట్ చేసే అవకాశం బహుశా ఎవరికీ రాదు. భవిష్యత్తులో నాక్కూడా రాదు. అందుకే అంటున్నా... à°ˆ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేశారో వాళ్లంతా అదష్టవంతులే.

'మనం' పాటల గురించి?
అన్ని పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాకు 'అమ్మ..' పాట బాగా నచ్చింది.

రేపు ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. మీ ఫీలింగ్?
నా ప్రతి సినిమాకీ విడుదల ముందు టెన్షన్ గా ఉంటుంది. ఈ సినిమాకి కూడా అంతే. ఆ టెన్షన్ సినిమా అందరికీ నచ్చదని కాదు. పరిక్ష బాగా రాసినా ఫలితం కోసం ఎదురు చూసేటప్పుడు టెన్షన్ గానే ఉంటుంది కదా. 'మనం' అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !