View

ఇంటర్య్వూ - హీరో రామ్ (నేను శైలజ)

Monday,December28th,2015, 09:40 AM

''రెగ్యులర్ ఫార్మట్ మూవీ చేసినప్పుడు సేఫ్టీ ఉంటుంది. కానీ, ఒక్కోసారి కథ కనెక్ట్ కాకపోతే, ప్రేక్షకులు ఆ చిత్రాన్ని తిరస్కరిస్తారు. చేసిన సినిమాలే చేసి మేమూ అలసిపోతాం. అందుకే, 'నేను.. శైలజ' వంటి డిఫరెంట్ మూవీని ఎన్నుకున్నాను. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. చక్కని ప్రేమకథా చిత్రం'' అని రామ్ అన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్, కీర్తి సురేష్ జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ 'స్రవంతి' మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 1న 'నేను శైలజ' విడుదల కానున్న సందర్భంగా రామ్ తో జరిపిన చిట్ చాట్.


వరుసగా మూడు సినిమాలు చేసి, 2015లో మీరు బిజీ బిజీ. ఇంతగా బిజీగా సినిమాలు చేయడం ఎలా అనిపించింది?
నాకు పనంటే ప్రేమ. షూటింగ్ లో ప్యాకప్ అనే పదాన్ని వినకూడదని కోరుకుంటుంటాను. ప్రొఫెషన్ అంటే అంత ప్రేమ. సో.. బిజీ బిజీగా సినిమాలు చేయడం చాలా హ్యాపీ అనిపించింది.


'నేను.. శైలజ' సినిమా ఎలా ఉంటుంది?
ప్యూర్ లవ్ స్టోరీ. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ ట్రాక్ సెపరేట్ గా ఉండదు, నా పాత్ర కూడా కామెడీ పండిస్తుంది. ఈ మధ్య అవుట్ అండ్ అవుట్ రెగ్యులర్ ఫార్మట్ మూవీస్ చేసి, ఈ ప్రేమకథా చిత్రం చేయడం కొత్తగా అనిపించింది.


ఇన్నాళ్లూ అలవాటుపడింది కాకుండా ఇలా కొత్త రకంగా చేయడం ఎలా అనిపించింది?
యాక్చువల్ గా మొదట్లో కన్ ఫ్యూజ్ అయ్యాను. రెగ్యులర్ ఫార్మట్ కి భిన్నంగా చేస్తున్నాం కదా... ఇలా చేయడం కరెక్టా? కాదా అని ఆలోచించేవాణ్ణి. కానీ, ఆర్టిస్ట్ గా నాకు మంచి సంతృప్తినిచ్చింది. కిశోర్ తిరుమల ఏం చెబితే అది చేశాను. తనను గుడ్డిగా ఫాలో అయిపోయాను. ముందు రోజు డైలాగ్స్ తీసుకోవడం వంటివి ఉండేది కాదు. లొకేషన్ కి రాగానే, డైలాగ్స్ ఇచ్చేవారు. అప్పటికప్పుడు నేర్చుకుని చెప్పేసేవాళ్లం. వంద శాతం కిశోర్ ని నమ్మి చేశాను.


ఇప్పటివరకూ చేసిన అన్ని సినిమాల్లోనూ ఎనర్జిటిక్ గా కనిపించారు. మరి.. ఈ ప్రేమకథా చిత్రంలో ఆ ఎనర్జీ ఉంటుందా?
ఎనర్జీ కొంచెం తగ్గించాల్సి వచ్చింది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎప్పటిలానే ఎనర్జటిక్ గా రెచ్చిపోతే, 'అంత వద్దు... కొంచెం తగ్గితే బెటర్' అని కొరియోగ్రాఫర్ తగ్గించేవారు. అలా, తగ్గి చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ, సినిమాలో ఎక్కడా డల్ గా కనిపించను.


ఈ సినిమాకి ముందు 'హరి కథ' అని టైటిల్ అనుకున్నారు కదా.. ఆ తర్వాత 'నేను శైలజ'ని ఖరారు చేయడానికి కారణం?
కిశోర్ తిరుమల ఈ కథ రాసుకున్నా 'హరి కథ'ని వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. ఆ టైటిల్ అంత ఎట్రాక్టివ్ గా లేదని చాలామంది అన్నారు. దాంతో 'నేను... శైలజ' అని పెట్టాం.


ఇప్పుడిలా గడ్డంతో కనిపిస్తున్నారు.. సినిమాలో కూడా అంతేనా?
సినిమాలో లవ్ ఫెయిల్యూర్ ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ లో భాగంగా ఓ ఐదు నిమిషాలు గడ్డంలో కనిపిస్తా. గడ్డం బాగుందనిపించి, ప్రస్తుతానికి ఇలానే కంటిన్యూ అవుతున్నాను.


మీ జీవితంలో ఎవరైనా శైలజ ఉన్నారా.. ?
లేరు. నేను సింగిల్ గా ఉన్నాను. ఈ చిత్రదర్శకుడు కిశోర్ జీవితంలో, కొంతమంది వ్యక్తుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉంటుంది. రియల్ ఇన్సిడెంట్స్ తో సాగుతుంది కాబట్టి, అందరూ కనెక్ట్ అవుతారు. కథకీ, డైలాగ్స్ కీ... ఇలా ఒకటి కాదు.. అన్నీ కూడా మన జీవితంలో ఇలానే జరిగింది? కదా అని ఏదో ఒక సీన్లో ప్రతి ప్రేక్షకుడికీ అనిపిస్తుంది.


మీరు, మీ పెదనాన్న డైరెక్షన్ విషయంలొ జోక్యం చేసుకుంటారనే టాక్ ఉంది.. నిజమా?
స్ర్కిప్ట్ విషయంలో ఇన్ వాల్వ్ అవుతాం. ఒకసారి కథ ఫైనలైజ్ చేసిన తర్వాత జోక్యం చేసుకోం. ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకుంటాం కానీ, వేరే జోక్యం ఏదీ ఉండదు. కిశోర్ కి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కొత్త దర్శకులతో చేసినప్పుడు వాళ్లకు షెడ్యూల్ ప్లానింగ్ గురించి పూర్తి అవగాహన ఉండే అవకాశం లేదు కాబట్టి, పెదనాన్న గైడ్ చేస్తారు. అదేం తప్పు కాదు కదా.


మీ గత చిత్రం 'శివమ్' ఆశించిన ఫలితం సాధించలేదు.. ఆ సినిమా రిజల్ట్ అలా అవ్వడానికి ఎవర్ని కారణంగా చెబుతారు?
ఎవర్నీ నిందించను. ఆ బాధ్యత నా మీద వేసుకుంటాను. ఎందుకంటే, కథ ఫైనలైజ్ చేసేది నేనే కదా.


ఆ సినిమా నిడివి ఎక్కువ కావడం మైనస్ అయ్యిందనుకుంటున్నారా?
నిడివి తక్కువగా ఉంటే సినిమా హిట్టవుతుందనలేదు. ఈ ఏడాది విడుదల చిత్రాల్లో నిడివి ఎక్కువ ఉన్న చిత్రాలు చాలా ఉన్నాయి. కథ కరెక్ట్ అయితే ఎంత లెంగ్త్ ఉన్నా ప్రేక్షకులు చూసేస్తారు.


న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి?
లాస్ట్ ఇయర్ అబ్రాడ్ వెళ్లాను. వచ్చే ఏడాది కూడా వెళ్లాలని గత ఏడాది అనుకున్నాను. కానీ, ప్లాన్ చేసినవన్నీ జరగవు కదా. సినిమా రిలీజ్ కాబట్టి, ఇక్కడే ఉంటాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !