View

కలిసి ఉండటానికి ఝాన్సీ ఇష్టపడలేదు: జోగినాయుడు

Saturday,June14th,2014, 03:38 AM

దర్శకుడు కావాలనే ఆశయంతో సినిమా పరిశ్రమకు వచ్చి, నటునిగా మారారు జోగినాయుడు. మొదట్లో పూరి జగన్నాథ్ దగ్గర టీవీ షోస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఆయన ఈవీవీ సత్యనారాయణ, కృష్ణవంశీ దగ్గర పలు చిత్రాలకు సహాయ దర్శకునిగా చేశారు. 'మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ మంచిది' ద్వారా జోగినాయుడిని ఈవీవీయే నటునిగా పరిచయం చేశారు. అలాగే టీవీ షో 'జోగి బ్రదర్స్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జోగినాయుడు. నేడు (14.6.2014) ఆయన పుట్టినరోజు. పరిశ్రమకు వచ్చి 20ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా జోగి నాయుడు తన వ్యక్తిగత, వత్తిపరమైన విషయాలను ఈ విధంగా పంచుకున్నారు.

- సినిమాలంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే, ప్రజల్లో క్రేజ్ సంపాదించుకునేది కళారంగం, క్రీడా రంగం, రాజకీయ రంగానికి సంబంధించినవారే. సినిమా రంగంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా ఇరవయ్యేళ్ల కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు, ఆనందకర సందర్భాలున్నాయి. మంచిని మాత్రమే గుర్తుంచుకుని, చెడు సంఘటనలను మర్చిపోతాను. ఎందుకంటే, చెడుని గుర్తుంచుకుని బాధపడితే చేకూరే లాభమేమీ ఉండదు. ఆరోగ్యమే పాడవుతుంది.

- దర్శకత్వ శాఖలో చేస్తూ ఉన్నప్పుడే ఈవీవీ సత్యనారాయణగారు 'మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది' ద్వారా నన్ను నటుణ్ణి చేశారు. ఆ సినిమాలో నా పాత్రకు మంచి పేరు రావడంతో నటుడిగా చాలా బిజీ అయ్యాను. ఓ ఐదారేళ్లు ఫుల్ బిజీ అన్నమాట. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్లీ 'స్వామి రారా'తో నా కెరీర్ పుంజుకుంది. ఇప్పుడు చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. విడుదలకు సిద్ధమైన వాటిలో ఓ పది సినిమాల్లో నేనున్నాను.

- నా కెరీర్ లో నాకు బాగా గుర్తింపు తెచ్చిన వాటిలో 'జోగి బ్రదర్స్' షో ఒకటి. ఆ షో చూసే కష్ణవంశీగారు నన్ను పిలిపించి, తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చుకున్నారు. అసలు మొదటిసారి నేను సహాయ దర్శకునిగా చేసినది అంటే.. ఈవీవీగారి దగ్గరే. 'అల్లుడా మజాకా' సినిమాకి పదిహేనుమంది అసిస్టెంట్స్ ఉంటే నేను చివరివాణ్ణి. ఓనాలుగైదు రోజులు పని చేశాను. ఆ తర్వాత ఎక్కువయ్యారంటూ నన్ను తీసేశారు. ఆ తర్వాత వేరే సినిమాలకు ఈవీవీగారి దగ్గర చేశాను.

- నేను చిరంజీవి అభిమాని. అనుకోకుండా ఆయనే ఓసారి నన్ను, జోగి కృష్ణంరాజుని పిలిపించారు. 'జోగి బ్రదర్స్' షో దానికి కారణంగా నిలిచింది. మమ్మల్ని పిలిపించి, 'భలే చేస్తున్నారయ్యా' అంటూ గంటసేపు మాట్లాడారు. ఆ గంటసేపూ షూటింగ్ ఆపి మరీ, మాతో మాట్లాడటం మర్చిపోలేని సంఘటన.

- ఈ ఏడాది చివర్లో నిర్మాణ సంస్థ ఆరంభించాలనుకుంటున్నా. చిన్న బడ్జెట్ చిత్రాలు తీయాలన్నది నా ఆకాంక్ష. భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేపడతా.

- వ్యక్తిగత విషయాలు చెప్పాలంటే.. అప్పట్లో ఓ నమ్మకంతో మా ఊరి నుంచి పరిశ్రమకు వచ్చినప్పుడు మా అమ్మా, నాన్న నన్ను ప్రోత్సహించారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ వాళ్లే నాకు అండగా ఉన్నారు.

- నేనెవరి కోసమూ పరిశ్రమకు రాలేదు. నాకోసమే వచ్చాను. అనుకోకుండా ఝాన్సీతో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం జరిగింది. మాకు పాప పుట్టినప్పుడు చాలా ఆనందపడ్డాను. చాలా ఏళ్లు బాగానే ఉన్నాం. మధ్యలో ఏవో సమస్యలు వస్తే పరిష్కరించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ, ఝాన్సీ కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. అందుకని, తప్పక విడాకులు ఇచ్చేశాను. మా పాప తన దగ్గరే ఉంటోంది. నా దగ్గర కూడా ఉండాలని నా ఆకాంక్ష.  à°† విషయమై కోర్టులో కేసు సాగుతోంది. నాకు అనుగుణంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నా.

- జీవితంలో నేను పశ్చాత్తాప పడాల్సిన సంఘటనలేవీ లేవు. నా పని, నేను అన్నట్లుగానే ఉన్నాను తప్ప నా కారణంగా ఎవరికీ నష్టం జరగలేదు. ఇరవయ్యేళ్ల కెరీర్ ద్వారా సాధించిన అనుభవంతో తదుపరి అడుగులను ప్లాన్ చేసుకుంటాను.

Jogi Naidu Birthday Interview



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !