View

మంచి సినిమా తీసామంటున్నారు - హీరో కార్తీక్ రాజు

Saturday,December02nd,2023, 03:28 PM

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలో క్లూస్ టీం ప్రాధాన్యతను చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం అథర్వ. కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మహేష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ సక్సెస్ మీట్‌‌ను శనివారం నిర్వహించారు.  ఈ ఈవెంట్‌లో...


*హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ..* ‘అథర్వ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. చాలా చోట్ల హౌజ్ ఫుల్స్ కనిపించాయి. మొదటి రోజే ఇంత మంచి ఆదరణ రావడంతో మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. ఏ ఒక్కరూ కూడా చెడ్డ సినిమా అని చెప్పడం లేదు. మంచి సినిమాను తీశామని అంటున్నారు. అక్కడే మా దర్శకుడు మహేష్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.


*నిర్మాత సుభాష్ నూతలపాటి మాట్లాడుతూ..* ‘సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఆడియెన్స్ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.


*గగన్ విహారి మాట్లాడుతూ..* ‘క్లూస్ టీం మీద మహేష్ రెడ్డి చాలా రీసెర్చ్ చేశారు. ఈ పాయింట్‌ కి ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతారని మా దర్శకుడు ముందే గెస్ చేశారు. క్లైమాక్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు ఇంత ఆదరణ వస్తుండటం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. ధర్మపురితో ఆల్రెడీ హీరోగా చేశాను. ఇందులో నేను చేసిన పాత్రకు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కంటి చూపుల్తోనే నటించాలని దర్శకుడు ముందే చెప్పారు. ఈ మూవీని ఆడియెన్స్ ఇంత ఆదరిస్తున్నందుకు చాలా థాంక్స్’ అని అన్నారు.


*దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ..* ‘మా సినిమాను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మీడియా, ఆడియెన్స్‌‌కు థాంక్స్. సినిమాల మీద ప్యాషన్‌తో యూకే నుంచి వచ్చాను. ఈ రోజు దర్శకుడిగా తెరపై నా పేరు చూసుకుంటుంటే ఎంతో ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఓ సినిమాను తీయడం, రిలీజ్ చేయడం, జనాల వరకు తీసుకెళ్లడం, ఆడియెన్స్ ప్రేమను దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఇదంతా టీం సమష్టి కృష్టి వల్లే జరిగింది. కొత్త పాయింట్, కొత్త కథ చెబితే ఆడియెన్స్ ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకే క్లూస్ టీం మీద సినిమాను తీశాను. కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. సిమ్రన్ చౌదరి చాలా బాగా నటించారని ఆడియెన్స్ అంటున్నారు. సారా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ రామరాజు తన కటౌట్‌కి తగ్గట్టుగా నటించాడు. గగన్ విహారికి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు. చాలా కష్టపడి నటించారు. అందరూ అద్భుతంగా నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన ఆర్ఆర్, పాటలు సినిమాకు ప్రాణంలా నిలిచింది. సాయి చరణ్ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. టీంలోని ప్రతీ ఒక్కరూ ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.


*సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ..* ‘అథర్వ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రను పోషించాను. థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇలాంటి గ్రిప్పింగ్ సినిమాను చాలా రోజుల తరువాత చూశామని, రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.


*కల్పికా గణేష్ మాట్లాడుతూ..* ‘ఇంత మంచి పాత్ర నాకు దొరుకుతుందని అనుకోలేదు. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సారా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.


*విజయ రామరాజు మాట్లాడుతూ..* ‘అథర్వ చిత్రంలో నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత మంచి చిత్రంలో పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !