View

మా పూర్వీకులకు నివాళి - యాటా సత్యనారాయణ

Tuesday,November28th,2023, 03:21 PM

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. మంగళవారం ఈ సినిమా నుంచి ‘పోతుగడ్డ మీద...’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి, డైరెక్టర్ యాటా సత్యనారాయణ, అనుష్య త్రిపాఠి, ప్రొడక్షన్ డిజైనర్ తిరుమల తిరుపతి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, కొరియోగ్రాఫర్ స్వర్ణ,లిరిక్ రైటర్ సుద్ధాల అశోక్ తేజ, బాబీ సింహ తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా... హీరోయిన్ అనుష్య త్రిపాఠి మాట్లాడుతూ - ‘‘‘పోతుగడ్డ మీద..’ సాంగ్ బ్యూటీఫుల్‌గా ఉంది. భీమ్స్ గారు పాటను అద్భుతమైన ట్యూన్‌ని అందించి, గొప్పగా పాడారు. బాబీ సింహగారు ప్రాణం పెట్టి నటించారు. దర్శకుడు యాటా సత్యనారాయణగారికి, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారు సహా టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.


సుద్ధాల అశోక్ తేజ మాట్లాడుతూ - ‘‘ఈ పాట రాయటానికి ముందు డైరెక్టర్ యాటా సత్యనారాయణ నన్ను పిలిచి మాట్లాడారు. సన్నివేశం గురించి నాకు నెరేట్ చేశారు. ఆయన నెరేషన్‌లోని ఎమోషన్స్ గొప్పగా ఉన్నాయి. ఈ రజాకార్ ఉద్యమంలో మా అమ్మ, నాన్న పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. సుద్దాల హనుమంతు, జానకమ్మ బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. అందువల్లే ఒకే వెర్షన్‌ రాశాను. గాయకుడు, సంగీత నాయకుడిగా భీమ్స్ ఉండటం కూడా నాకు కలిసొచ్చింది. అతను కూడా రజాకార్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చారు. అలాగే హీరో, కొరియోగ్రాఫర్ స్వర్ణ అందరం ఏకాత్మగా పాటను రూపొందించాం. ఇలాంటి సినిమా తీయటానికి డబ్బులు ఉంటేనే సరిపోదు. గట్స్ ఉండాలి. అలాంటి ధైర్యం ఉన్న గూడూరు నారాయణ రెడ్డిగారికి ఉంది. సినిమా రిలీజ్ కాకుండా హిట్ అయ్యిందనే చెప్పాలి’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ - ‘‘రజాకార్’ నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. ప్రతిరోజూ నన్ను ఏడిపిస్తోన్న సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో పాట పాడటం, సంగీతం చేయటం అంటే అమరులైన వీరుల కోసం పాడిన పాట అనే చెప్పాలి. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో వారందరినీ స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చెప్పాలి. మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన ఆత్మకు నివాళిగా ఈ సినిమాను నేను చేస్తున్నానని భావిస్తున్నాను. ఈ మూవీకి పని చేసినందుకు గర్వంగా ఉంది. గూడూరు నారాయణరెడ్డి, యాటా సత్యనారాయణ రెడ్డి, అంజి రెడ్డి వంటి వారు అరుదుగా ఉంటారు. సుద్దాల అశోక్ తేజగారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సినిమా రీరికార్డింగ్ జరుగుతుంది. రీల్ టు రీల్ చూసి కన్నీళ్లు పెట్టుకునేంత ఎమోషనల్‌గా సినిమా ఉంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు, వర్క్ చేసిన సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అన్నారు.


బాబీ సింహ మాట్లాడుతూ - ‘‘భీమ్స్ గారి సంగీతం, సుద్దాల అశోక్ తేజగారు అందించిన సాహిత్యంలో తెలియని ఎమోషన్ ఉంది. సినిమా షూటింగ్ సమయంలోనూ మేం అంతే రేంజ్‌లో ఎమోషనల్‌గా ఉన్నాం. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ సత్యనారాయణగారి దగ్గర మన హిస్టరీ ఏంటి?అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మనవాళ్లు ఇంత కష్టపడ్డారా? అనిపించింది. యాటా సత్యనారాయణ, నిర్మాత గూడూరు నారాయణరెడ్డిగారికి థాంక్స్. అనుష్య మంచి నటి. రాబోయే కాలంలో ఇంకా బెస్ట్ పోజిషన్‌లో ఉంటుంది. తిరుమల తిరుపతిగారు ఆర్ట్ వర్క్‌తో నాటి నైజాం కాల పరిస్థితులను మన కళ్ల ముందుకు తీసుకొచ్చారు. ఇదొక గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. అందరికీ థాంక్యూ సో మచ్’’ అన్నారు.


డైరెక్టర్ యాటా సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘సుద్దాల హనుమంతు, జానకమ్మ వంటి పోరాట యోధుల ఉగ్గు పాటలతో పెరిగాం. సినిమా తీస్తున్నంతసేపు కళ్లలో ఎమోషన్, గుండెల్లో ఆవేశం వరదలై పారుతుంది. ఈరోజు స్టేజ్‌పై సుద్ధాల అశోక్ తేజగారు, భీమ్స్ గారు కావాలనే ఎమోషనల్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంత ఆవేదన నిండి ఉంది. నేను సుద్ధాలగారికి నెరేషన్ ఇచ్చినప్పుడు రాస్తారో రాయోరోనని అనుకున్నా. కానీ ఆయన నా ఎమోషన్‌ని అర్థం చేసుకుని పాటను రాసి వచ్చి ఆఫీసుకి వచ్చి పాడి వినిపించారు. అలాగే భీమ్స్ గారు పాడిన పాట వింటే పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఉంటుంది. ఇది మా పూర్వీకులను గుర్తు చేసుకుంటూ మేం చేసుకున్న నివాళి ఇది. స్వర్ణగారు పాటకు అద్భుతంగా కొరియోగ్రఫీ అందించారు. బాబీ సింహగారిని మలయాళ ఆర్టిస్ట్ అనుకున్నాను. కానీ ఆయన తెలుగువాడేనని తర్వాత తెలిసింది. ఈ చిత్రంలో తన నటనను చూస్తే ఆశ్చర్యపోతారు. తనలో కొత్త నటుడిని చూస్తారు. అనుష్య త్రిపాఠి చాలా బాగా నటించింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ - ‘‘రజాకార్ సినిమా కోసం సబ్జెక్ట్ ఉన్న గట్స్ టీమ్ వర్క్ చేసింది. తొలి సినిమాకు హయ్యర్ బడ్జెట్‌తో గూడూరు నారాయణ రెడ్డిగారు సినిమా తీయగం గొప్ప విషయం. బాబీ సింహ, అనుష్య, డైరెక్టర్ యాటా సత్యనారాయణ, సుద్దాల అశోక్ తేజగారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సహా సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !