View

చిరంజీవి, ఎన్టీఆర్ కి ఆ ఇద్దరి గోల తప్పదా?

Tuesday,September16th,2014, 06:55 AM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది నటులు ఉన్నది నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కుటుంబానికి చెందినవారే. ఎన్టీఆర్ కుటుంబం నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న ఉన్నారు. నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రానికి కూడా రంగం సిద్ధమవుతోంది. ఏయన్నార్ ఫ్యామిలీలో నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగతచైన్య ఉన్న విషయం తెలిసిందే. త్వరలో అఖిల్ రంగ్రపవేశం జరగనుంది. ఇక.. చిరంజీవి కుటుంబం నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్ ఇప్పటికే తెరపై మెరిశారు. త్వరలో సాయిధరమే తేజ్, వరుణ్ తేజ్ వెండితెరకు రానున్నారు. కాగా.. ఒకే కుటుంబం నుంచి ఎంతమంది వచ్చినా.. ఆ కుటుంబానికి చెందిన వారిలో ఒకరిద్దరిపైనే అభిమానులు ప్రేమ పెంచుకుంటారు.

అలా.. నందమూరి తారకరామారావు తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆ కుటుంబానికి చెందినవారిలో బాలకృష్ణనే ఎక్కువగా అభిమానిస్తారు. ఇక.. చిరంజీవి విషయానికొస్తే.. వాళ్ల వంశం సినిమాల్లోకి రావడానికి కారణం తనే. కాబట్టి.. తననే ప్రేమించేవారు. అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చిరంజీవికన్నా పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, ఎలాంటి నిర్ణయానైనా నిర్మొహమాటంగా తీసుకోగలడు అనే ముద్ర పడటంతో అన్నకన్నా తమ్ముణ్ణే ఎక్కవగా అభిమానిస్తున్నారు. అలాగే, మహానటుడు ఎన్టీఆర్ కుటుంబంలో మంచి మాస్ హీరోగా ఎదిగినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం బాలకృష్ణను అభిమానించినంతగా అభిమానించలేకపోతున్నారు. ఫలితంగా ఇటు చిరంజీవి అటు ఎన్టీఆర్ ఏ వేడుకలో పాల్గొన్నా బాధపడక తప్పడంలేదు. అక్కినేని కుటుంబానికి మాత్రం ఈ బాధ లేదు. ఎందుకంటే ఈ కుటుంబమంతా వేడుకల్లో కనిపిస్తారు. ఒకే వేదికపై మెరుస్తుంటారు.వారి మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా అనిపించదు.

అన్నను మించిన తమ్ముడు పవన్ కళ్యాణ్...

చిరంజీవి ఏ వేడుకకు వచ్చినా అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతుంటారు. 'పవన్ కళ్యాణ్' అంటూ ఆడిటోరియం హోరెత్తిపోయేట్లు కేకలు పెడుతుంటారు. సొంత తమ్ముణ్ణి  à°ˆ స్థాయిలో అభిమానిస్తే ఏ అన్నకు మాత్రం ఆనందంగా ఉండదు. కానీ మరీ తనను దాటుకుని పవన్ పై అభిమానం చూపించడం, ఒకవైపు వేదికపై తను ఉన్నా పవన్ గురించే à°…à°¡à°—à°¡à°‚.. చిరంజీవిని ఇబ్బందులో పెడుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న (15.09.) జరిగిన 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో వేడుకలో అభిమానులు పవన్ కళ్యాణ్ గురించే à°…à°¡à°—à°¡à°‚ ఇటు చిరంజీవిని అటు రామ్ చరణ్ ని మనస్తాపానికి గురి చేసినట్లు వారి ముఖ కవళికలు చెప్పేశాయ్...

పవన్ కళ్యాణ్ కి తిరుగు లేదు...

అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్లు.. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకొచ్చిన తర్వాత చిరంజీవిపై అభిమానులకు కొంచెం ప్రేమ తగ్గిందనే చెప్పాలి. పవన్ నిజాయితీపరుడని, అన్నకన్నా తమ్ముడు మంచివాడని చాలామంది ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా చిరంజీవి రాజకీయాల్లోకి రావడం అతనికి పెద్ద దెబ్బ అయ్యింది. పార్టీ పెట్టడం, కాంగ్రెస్ తో చేతులు కలిపి, విలీనం చేయడంతో అతని ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. మరోవైపు అన్న వెళ్లిన బాటలో కాకుండా రాష్ర్ట శ్రేయస్సు కోసం కాంగ్రెస్ కి పవన్ అడ్డం తిరగడం అతని ఇమేజ్ ని అమాంతంగా పెంచేసింది. ఫలితంగా చిరంజీవికి లేనంత క్రేజ్ పవన్ కి వచ్చేసింది. దాంతో.. చిరు ఎక్కడికెళ్లినా అతన్ని గురించి పట్టించుకోకుండా పవన్ గురించి అడుగుతున్నారు. చిరు తనయుడు రామ్ చరణ్ కి కూడా ఇది తప్పడంలేదు. అతని వేడుకల్లోనూ బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించే అడుగుతున్నారు. సో.. పవన్ కళ్యాణ్ కి తిరుగులేదు.

ఇరుకుల్లో ఎన్టీఆర్...

జూనియర్ ఎన్టీఆర్ కెరీర ఎలా ఆరంభమైందో, ఒకటి, రెండు చిత్రాలతోనే అతని కెరీర్ ఎంత ఎత్తుకు ఎదిగిందో తెలిసిందే. అప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి సైతం ఎన్టీఆర్ కి వచ్చిన మాస్ ఇమేజ్ కి షాకయ్యాడు. ఒకింత టెన్షన్ కూ గురయ్యాడు. ఆ తర్వాత ఆరేడేళ్లు ఎన్టీఆర్ బాగానే వెలిగాడు. నందమూరి కుటుం సభ్యులు కూడా ఎన్టీఆర్ ని బాగానే అక్కున చేర్చుకున్నారు. దగ్గరుండి మరీ వైభవంగా పెళ్లి చేశారు. మరి.. ఆ తర్వాత ఏమైందో కానీ.. ఎన్టీఆర్ ని పక్కన పెట్టేసింది ఆ కుటుంబం. విజయం తాలూకు గర్వంతో ఈ జూనియర్ లెక్కలేనితనంగా వ్యవహరించాడని, పోజులు కొట్టాడని టాక్. చివరికి తనను అక్కున చేర్చుకున్న బాబాయ్ బాలకృష్ణ పట్ల కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడట. అందుకే.. ఆ కుటుంబం ఇతగాణ్ణి పక్కన పెట్టిందని భోగట్టా. కానీ, దీనివల్ల ఎన్టీఆర్ చాలానే నష్టపోయాడు. బాలయ్య భోళాశంకరుడు, మంచివాడనే ఇమేజ్ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా నందమూరి అభిమానులకు బాలయ్య అంటే మహా ప్రేమ. దాంతో జూనియర్ ఎన్టీఆర్ పై ఆగ్రహం పెంచుకున్నారు. ఒప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు అభిమానుల ఆగ్రహం కారణంగా ఓపెనింగ్స్ కూడా రావడంలేదు.

ఫైనల్ à°—à°¾ చెప్పొచ్చేదేంటంటే... బాలయ్య, పవన్లు అభిమానుల నుంచి పొందినంత ప్రేమాభిమానాలను ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో  à°…టు చిరంజీవి, రామ్ చరణ్... ఇటు ఎన్టీఆర్ పొందలేరన్నది ఖాయం.  à°ªà°µà°¨à± కళ్యాణ్ వల్ల మిగతా మెగా హీరోలకు, బాలయ్య వల్ల ఎన్టీఆర్ à°•à°¿ ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు. అదే బాలయ్య, ఎన్టీఆర్ ఒకే వేదికపై, చిరంజీవి తన తమ్ముడి పవన్ కళ్యాణ్ తో కలిసి ఒకే వేదికపై కనిపిస్తే... అభిమానుల నుంచి à°ˆ ఇబ్బందులు ఉండవు. మరి బాలయ్యతో సంధి కుదుర్చుకుని ఎన్టీఆర్, పవన్ ని కలుపుకుని చిరంజీవి ముందుకు సాగే అవకాశం ఉందా? అదే కనుక జరిగితే నందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఫుల్ హ్యాపీస్. అది జరగాలని కోరుకుందాం.

Chiranjeevi, NTR in dilemma



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !