View

టాప్ హీరోలకు షాకిచ్చిన 2014

Wednesday,December31st,2014, 04:27 AM

టాలీవుడ్ నెం.1 స్థానం కైవసం చేసుకోగల సత్తా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు 2014 షాక్ ఇచ్చింది. ఈ యేడాది ఈ ఇద్దరు హీరోలు నటించిన చిత్రాలు డిజాస్టర్ గా నిలవడం చిత్ర పరిశ్రమను సైతం షాక్ కి గురి చేసింది. మహేష్, ఎన్టీఆర్ సైతం ఈ సినిమాల రిజల్ట్ పట్ల చాలా నిరాశపడిపోయారనే టాక్ ఉంది. ఈ సినిమాల తర్వాత తదుపరి సినిమాల విషయాల్లో మహేష్ బాబు, ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారట. అంతలా ఈ ఇద్దరినీ ఈ సినిమాలు టెన్షన్ కు గురి చేసాయి. ఈ యేడాది ఈ ఇద్దరికీ షాక్ ఇచ్చిన సినిమాల గురించి ఓసారి చెప్పుకుందాం.

1 నేనొక్కడినే
టాలీవుడ్ నెం.1 స్థానం మహేష్ బాబుదే అని ఫిక్సయిన వారందరూ '1' నేనొక్కడినే టైటిల్ పర్ ఫెక్ట్ గా మహేష్ బాబుకే సూట్ అవుతుందని బహిరంగంగానే అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు చాలా ఇష్టంగా చేసాడు. నిజం చెప్పాలంటే ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ, ముందుకు సాగుతున్న మహేష్ ప్రయోగాత్మక చిత్రం చేయడానికి కూడా వెనుకాడడని ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు. యాక్షన్, సెంటిమెంట్, లవ్ అన్ని అంశాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ అవ్వలేదు. ఏ సినిమా అయినా మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితేనే కమర్షియల్ విజయం సాధించగలదు. ఈ సినిమా క్లాన్ పీపుల్స్ కి కనెక్ట్ అయినంతగా, మాస్ కి కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఈ సినిమా రిజల్ట్ నిరాశపరిచింది. కానీ మహేష్ బాబు నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

ఆగడు

1 నేనొక్కడినే రిజల్ట్ నిరాశపరచడంతో తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా, శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' టైటిల్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసాడు మహేష్. కానీ ఈ సినిమా రిజల్ట్ కూడా నిరాశపరిచింది.

2014 disappointed Maheshbabu and N.T.R

à°°à°­à°¸
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'రభస' చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యింది. ఎన్టీఆర్ నటన పరంగా, ఫైట్స్ పరంగా, డ్యాన్స్ పరంగా ఎక్కడా తగ్గలేదు. అయినా సరే ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. దీనికి కారణం కథ. కథలో పట్టులేకపోవడం, ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేసేంత గ్రిప్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కు లేకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయ్యిందనే విమర్శలు వచ్చాయి. 'రభస' టైటిల్ తో ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తాడని భావించిన ఎన్టీఆర్ అభిమానులను ఈ సినిమా చాలా నిరాశ పరిచింది.

ఈ యేడాది ఈ సినిమాల ద్వారా మహేష్ బాబు, ఎన్టీఆర్ నిరాశపడినప్పటికీ, వచ్చే యేడాది బ్లాక్ బస్టర్స్ ఇవ్వడానికి ఈ హీరోలు సమాయత్తమవుతున్నారు. ఈ యేడాది చేదు అనుభవాలను చవిచూసిన మహేష్, ఎన్టీఆర్... వచ్చే యేడాది బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని కోరుకుందాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !