View

ఇంటర్య్వూ - విశ్వక్ సేన్ (దాస్ కా ధమ్కీ) 

Thursday,March23rd,2023, 03:16 PM

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు,దర్శకుడు,నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటించింది. ఉగాది కానుకగా నిన్న (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఎక్స్ టార్డినరీ ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా ‘దాస్ కా ధమ్కీ’ బ్లాక్ బస్టర్ విశేషాలని విలేఖరులు సమావేశంలో పంచుకున్నారు విశ్వక్ సేన్.


‘దాస్ కా ధమ్కీ’ సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ?
‘దాస్ కా ధమ్కీ’ మేము అనుకున్నదాని కంటే పెద్ద సక్సెస్ అయ్యింది. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు 8 కోట్ల 88లక్షలు. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇవే. ఈ విజయం ఇంకా ఎంత పెద్దది అవుతుందో చూడాలి. మాకు ఒక టార్గెట్ వుంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యాక ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం.


హీరో, దర్శకుడు, నిర్మాత..ఈ మూడు బాధ్యతలు నిర్వహించడం ఎలా అనిపించింది?
ఖచ్చితంగా ఒత్తిడి వుంటుంది. పైగా ఇది సేఫ్ బిజినెస్ చేసిన రిలీజ్ చేసిన సినిమా కాదు. రిస్క్ చేసిన ఆడిన ఆట కాబట్టి మజా వస్తుంది. హీరో, దర్శకత్వం, నిర్మాణం ఇష్టం తోనే చేస్తాను. అయితే నిర్మాణంలో ఒత్తిడి కూడా వుంటుంది. సినిమా తీసున్నప్పుడు కష్టపడినట్లు అనిపించదు. విడుదల సమయంలోనే ఒత్తిడి వుంటుంది. పైగా ఈ సినిమాకి అంతా పెట్టేశాం. ఫలక్ నామా దాస్ కంటే పదింతలు పెట్టాం. సినిమా చేయడం కష్టం కాదు కానీ విడుదల చేయడం మాత్రం కష్టంతో కూడుకున్న పని.


ప్రేక్షకులతో కలసి సినిమా చూస్తున్నపుడు ఫలనా సీన్ ఇంకా బాగా తీయాల్సిందని ఎప్పుడైనా అనిపించిందా ?
లేదండీ. అన్ని ఒకటికి పదిసార్లు చూసి పర్ఫెక్ట్ అని భావించిన తర్వాతే విడుదల చేస్తాం. ఈ విషయంలో ఎలాంటి రిగ్రేట్ లేదు.


ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కి క్లాప్స్ పడ్డాయి .. ప్రేక్షకులతో కలసి సినిమా చూస్తున్నపుడు ఎలా అనిపించింది ?
నిజానికి కామెడీ నా బలం కాదు. యాక్షన్ డార్క్ డ్రామా ఇంటెన్స్ ఎమోషన్స్ బాగా డైరెక్ట్ చేస్తా. అయితే ఈ సినిమాతో కామెడీ కూడా బాగా తీయగలననే నమ్మకాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. ఫస్ట్ హాఫ్ ని హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు.


నివేదా పేతురాజ్ ని చాలా కొత్తగా చూపించారని ఆడియన్స్ అంటున్నారు ?
పేపర్ మీద కథ రాసినపుడు ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా వుండేది. ఆ పాత్ర ఎవరు చేసిన వారికి మేలు జరిగేది. నివేదా ఆ పాత్రని చక్కగా ఎంచుకుంది. చాలా బలమైన పాత్ర అది. చాలా బాగా ఫెర్ఫార్మ్ చేసింది.


పార్ట్ 2 ఆలోచన మొదట నుంచే ఉందా ?
ఒక రచయిత నుంచి నిర్మాత ఫస్ట్ డ్రాఫ్ట్ తీసుకుంటాడు. ఆ నిర్మాత దాన్ని ఎన్ని డ్రాఫ్ట్ లుగా అయినా తయారు చేయొచ్చు. తనకు నచ్చింది వచ్చే వరకూ ఎంతమంది రచయితలతోనైనా పని చేయొచ్చు. హాలీవుడ్ లో ఇలానే జరుగుతుంది. ‘దాస్ కా ధమ్కీ’ సెకండ్ డ్రాఫ్ట్. ఫస్ట్ డ్రాఫ్ట్ ప్రసన్న నుంచి కొన్నాను. తను దిన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాశాడు. నేను రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా మార్చాను. దీనిని రాస్తున్నపుడు రెండో పాత్ర బ్యాక్ స్టొరీ రాసుకున్నాను. తన ప్రపంచం చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది పార్ట్ 2 లో కీలకంగా వుంటుంది.


స్పెయిన్ నేపధ్యం ఎంచుకోవడానికి కారణం ?
కారణం ఏం లేదు లేదండీ. ఎప్పుడూ వెళ్ళలేదు ( నవ్వుతూ)


డ్యుయల్ రోల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది ? ఎలా అనిపించింది ?
చాలా ఆనందంగా వుంది. ఈ మధ్య కాలంలో డ్యుయల్ రోల్స్ అటు ఇటు అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత దాస్ కా ధమ్కీ డ్యుయల్ రోల్ క్లిక్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తున్నపుడు .. కరెక్ట్ గా చేశామనిపించింది.


ఫస్ట్ హాఫ్ లో కామెడీ,, సెకండ్ హాఫ్ లో సీరియస్ టోన్ లో వుంటుంది కదా.. ఇది రిస్క్ అనిపించిందా ?
రిస్క్ కంటే బోనస్ ఇస్తున్నా అనిపించింది. ఈ కథని ఎవరూ గెస్ చేయలేరనే కాన్ఫిడెన్స్ లోనే ఇంత డబ్బులు పెట్టి స్వయంగా డైరెక్షన్ చేశా.ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ బోనస్ అయితే సెకండ్ హాఫ్ కి చివరి ఐదు నిముషాలు బోనస్.


మళ్ళీ దర్శకత్వం ఎప్పుడు ?
నాలుగు సినిమాలు ఒప్పుకున్నాను. అవి పూర్తి చేయాలి. ఆ నాలుగు సినిమాల తర్వాత దర్శకత్వం చేస్తా. ఫలక్ నామా దాస్ 2, ధమ్కీ 2 రెండూ వున్నాయి. అయితే ఈ రెండింట్లో ఏది ముందు వస్తుందో ఇప్పుడే చెప్పలేను.


ధమ్కీ మిగతా భాషల విడుదల ఎప్పుడు ?
మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు రెడీగా వున్నాం. హిందీ ఏప్రిల్ 14 అనుకుంటున్నాం. ప్రశాంతంగా ఒకొక్కటి చేస్తాం. ప్రమోషన్స్ కూడా చూసుకోవాలి కదా.


కొత్తవారితో సినిమాలు చేసే ఆలోచన ఉందా ?
ఖచ్చితంగా. ఈ సినిమా నాకో వందకోట్లు ఇస్తే.. మొదట కొత్తవారితో ఓ సినిమా చేస్తా. ఆ కృతజ్ఞత ఎక్కడికీ పోదు.


లియాన్ జేమ్స్ కి చాలా మంచి పేరు వచ్చింది కదా మళ్ళీ కంటిన్యూ చేస్తారా ?
లియాన్ జేమ్స్ వండర్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. నా ప్రొడక్షన్ లో మరో సినిమా తనతోనే చేస్తున్నా. తనతో జర్నీ కంటిన్యూ అవుతుంది.


కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
సితార వంశీ గారి సినిమా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా. ఈ రెండిటి తర్వాత నా సొంత ప్రొడక్షన్ లో మరో సినిమా వుంటుంది. ‘గామి’ విడుదలకు రెడీగా వుంది.


ఆల్ ది బెస్ట్
థాంక్స్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !