View

ఇంటర్య్వూ - హీరోయిన్ కీర్తి సురేష్ (దసరా)

Saturday,March25th,2023, 03:31 PM

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ విలేఖరు సమావేశంలో దసరా విశేషాలని పంచుకున్నారు.


దసరాలో మీ పాత్ర సవాల్ తో కూడుకున్నదిగా అనిపిస్తోంది. మేకప్ కూడా డార్క్ గా వుంది. మీ పాత్ర గురించి ?
దసరాలో సవాల్ తో కూడుకున్న పాత్ర చేశా. మేకప్ వేయడానికి, తీయడానికి కూడా కొన్ని గంటలు పట్టేది. దుమ్ము, బొగ్గు ఇలా రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశాం. మేకప్ తీసి మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాల సమయం పట్టేది. తెలంగాణ యాస మాట్లాడే పాత్ర. మొదట కష్టం అనిపించిది. తర్వాత అలవాటైపోయింది. ఇందులో నా పాత్ర పేరు వెన్నెల. నా కెరీర్ లో పోషించిన ఓ ఛాలెజింగ్ రోల్ ఇది. వెన్నెల అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది.


తెలంగాణ యాస మాట్లాడటం ఎలా అనిపించింది ?
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అసోసియేట్ శ్రీనాథ్ నాకు తెలంగాణ యాస నేర్పించారు. ఆయనకి మొత్తం యాస మీద పట్టుంది. అలాగే ఒక ప్రొఫెసర్ కూడా వున్నారు. చాలా చిన్న చిన్న వివరాలు కూడా యాడ్ చేశారు. దసరాకి నేనే డబ్బింగ్ చెప్పా. మాములుగా అయితే రెండు లేదా మూడు రోజులు డబ్బింగ్ చెబుతా. కానీ దసరాకి మాత్రం ఐదారు రోజులు పట్టింది.


దసరా చేస్తున్నప్పుడు మహానటి వైబ్స్ వచ్చాయని అన్నారు కదా ? ఏ రకంగా మహానటి గుర్తు వచ్చింది ?
ఒక సినిమాతో ఒక ఫీల్ వుంటుంది. సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫీలౌతాం. అది మహానటికి వుండేది. ఇప్పుడు దసరాకి వచ్చింది.


‘మహానటి’కి జాతీయ అవార్డ్ వచ్చింది కదా.. దసరాకి కూడా వస్తుందని భావిస్తున్నారా ?
నేనేం ఆశించడం లేదండీ. నిజానికి మహానటి కూడ నేను ఆశించలేదు. అందరి బ్లెసింగ్స్ తో వచ్చింది. సినిమా బాగా ఆడాలి, అందరూ వారి బెస్ట్ వర్క్ ని ఇవ్వాలని మాత్రమే అనుకుంటాను.


దసరాకి ఎలాంటి హోం వర్క్ చేశారు ?
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథని అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. దర్శకుడు పాత్ర, కథని ఒక మీటర్ లో అనుకుంటారు. ఆ మీటర్ ని అర్ధం చేసుకున్న తర్వాత నేను ఎలా చేయాలనిఅనుకుంటున్నాను.. దర్శకుడు ఏం కోరుకుంటున్నారు .. దాన్ని అర్ధం చేసుకొని క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలనే దానిపై వర్క్ చేశాం.


నేను లోకల్ తర్వాత నాని గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
నాని గారితో నేను లోకల్ తర్వాత ఇలాంటి పాత్ర కోసం చాలా వెయిట్ చేసి చేసిన సినిమా దసరా. నాని గారితో చాలా కాలం తర్వాత కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వెన్నెల చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూశాను.


దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి ?
శ్రీకాంత్ ఎక్స్ లెంట్ డైరెక్టర్. తన వర్క్ చూస్తే మొదటి సినిమా చేస్తున్న దర్శకుడిలా అనిపించలేదు. తనకి చాలా క్లారిటీ వుంది. ఇండస్ట్రీ కి శ్రీకాంత్ లాంటి దర్శకుడు రావడం ఆనందంగా వుంది. భవిష్యత్ లో తను అద్భుతమైన చిత్రాలని అందిస్తాడు.


చమ్కీల అంగీలేసుకొని పాట చాలా పాపులర్ అయ్యింది కదా.ఇంత పాపులర్ అవుతుందని ముందే అనుకున్నారా ?
ఆ పాట వినగానే అన్ని పెళ్లిల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్ వుంది. లిరిక్స్ చాలా అందంగా వుంటాయి. అప్పుడే పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధించింది.


మహానటి తర్వాత మీరు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తారాని వార్తలు వచ్చాయి. కానీ మీరు వెళ్ళలేదు. దసరా ఇప్పుడు పాన్ ఇండియా విడుదల అవుతుంది కదా ? దిని గురించి ?
కొన్ని కథలు విన్నాను. కానీ బలమైన పాత్ర అనిపించలేదు. ఇప్పుడు దసరా పాన్ ఇండియా విడుదలౌతుంది కాబట్టి బలమైన పాత్రలు వస్తాయో చూడాలి. నాకు మాత్రం చేయాలనే వుంది. అయితే ముందు మంచి పాత్రలు, కథలు కుదరాలి.


ఆల్ ది బెస్ట్
థాంక్స్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !