View

ఇంటర్య్వూ - హీరోయిన్ సాక్షి వైద్య (ఏజెంట్) 

Thursday,April27th,2023, 02:38 PM

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ సాక్షి వైద్య విలేకరుల సమావేశంలో ‘ఏజెంట్’ విశేషాల్ని పంచుకున్నారు. 


ఏజెంట్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?కోవిడ్ సమయంలో కాలేజ్ కూడా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. నాకు ఖాళీ ఉండకుండా ఎదో ఒకటి చేయడం అలవాటు. ఆ సమయంలో సోషల్ మీడియా రీల్స్ చేశాను. అందులో కొన్ని వైరల్ అయ్యాయి. నా ఫ్రెండ్స్ ఆడిషన్స్ కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ముంబైలో కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఆ సమయంలో ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ కాల్ చేసి సినిమా గురించి చెప్పారు. మొదట నమ్మలేదు. తర్వాత ముంబైలో ముఖేష్ అనే కాస్ట్యూమ్ డైరెక్టర్.. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరెక్టర్, బిగ్ కోస్టార్, చాలా మంచి అవకాశం అని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. సురేందర్ రెడ్డి గారికి నచ్చింది. అలా ఏజెంట్ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. 


మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ?

మాది ముంబైలోని థానే. స్కూల్, కాలేజ్ అక్కడే జరిగింది. నేను  ఫిజియోథెరపిస్ట్ ని. ఇప్పుడు నటిగా మారాను.(నవ్వుతూ). 


ఏజెంట్ లో మీ పాత్ర ఎలా వుంటుంది ?ఏజెంట్ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. అయితే సినిమా, జీవితం ప్రేమ లేకుండా పూర్తవ్వదు. ఇందులో ఏజెంట్ కి ప్రేయసిగా కనిపిస్తా. ఏజెంట్ మొత్తం సీక్వెన్స్ మాతోనే మొదలౌతుంది. 


అఖిల్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

అఖిల్ గ్రేట్ పర్శన్. చాలా హంబుల్. చక్కగా మాట్లాడతారు. తన నుంచి చాలా నేర్చుకున్నాను. 


ఇది మీ మొదటి సినిమా.. ఇప్పటికే చాలా ప్రశంసలు వచ్చాయి.. ఎలా అనిపిస్తుంది ?చాలా ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులు మనసు చాలా గొప్పది. చాలా అభిమానిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తెలుగు నేర్చుకుంటున్నాను. 


ఏజెంట్ లో మీ పాత్రకు  ఎలాంటి ప్రాధన్యత వుంటుంది ?ఏజెంట్ లో నాది కీలకమైన పాత్ర. నటించడానికి ఆస్కారం వుండే పాత్ర. నా మొదటి సినిమాకే ఇంత పెద్ద సినిమా దొరకడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారు. 


ఏజెంట్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?ఏజెంట్ మాసీవ్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఏజెంట్ యాక్షన్.. థ్రిల్.. ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్ ఇస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది.  


అఖిల్ తో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది ?

చాలా ఎంజాయ్ చేశాను. నేను భరతనాట్యం నేపధ్యం నుంచి రావడం వలన స్టెప్స్ ని త్వరగా నేర్చుకోగలిగాను. 


ఇది మీ మొదటి సినిమా కదా.. ‘ఏజెంట్’ నుంచి ఏం నేర్చుకున్నారు ?మామూలుగా ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు చాలా తేలిగ్గా ఒక మాట అనేస్తాం. కానీ నటిస్తున్నపుడు, యూనిట్ లో భాగమైనపుడు అసలు కష్టం తెలుస్తుంది. ఏజెంట్ లో ఆ కష్టం తెలిసింది. పేరు తెచ్చుకోవాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే. 


ఏజెంట్ లో మీ సహానటులు గురించి చెప్పిండి ?ఇందులో అను గారు, మురళి శర్మ గారితో నాకు సీన్స్ వున్నాయి. ఇలాంటి వెటరన్ నటులతో పని చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. వారి సూచనలు కూడా చాలా సహకరించాయి. 


ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ లో పని చేయడం ఎలా అనిపించిది ?ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ చాలా హెల్ప్ ఫుల్ ప్రొడ్యూసర్స్. చాలా మంచి టీం. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి బిగ్ బ్యానర్ లో మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శక, నిర్మాతల నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. 


కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
వరుణ్ తేజ్ గారితో ఓ సినిమా చేస్తున్నా. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !